లాయ‌ర్ ప్ర‌శ్నః క‌స‌బ్ కంటే శిరీష కేసు పెద్దదా?

Update: 2017-06-26 12:31 GMT
బ్యూటీషియన్ శిరిష ఆత్మహత్య కేసులో నిందితులు రాజీవ్ - శ్రావణ్‌ లకు రెండు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో నిందితులను చంచల్‌ గూడ జైలు నుంచి బంజారాహిల్స్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. శిరీష ఆత్మహత్య కేసును పోలీసులు మరింత లోతుగా విచారించనున్నారు. ఈ సంద‌ర్భంగా లాయ‌ర్ వెంక‌ట్ మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన‌ వ్యాఖ్య‌లు చేశారు.

శిరీష మృతి కేసులో అస‌లేం జ‌రిగిందో తేల్చేందుకు పోలీసులు క‌స్ట‌డీ కోరార‌ని న్యాయ‌వాది వెంక‌ట్ తెలిపారు. తాజా విచార‌ణ‌లో భాగంగా నిందితుల‌పై థ‌ర్డ్ డిగ్రీ విచార‌ణ‌ జ‌ర‌ప‌వ‌ద్ద‌ని న్యాయ‌స్థానం ఆదేశించినంద‌ని అన్నారు. విచార‌ణ‌లో భాగంగా పోలీసులు స‌రైన రీతిలోనే ముందుకు సాగుతున్నార‌ని తెలిపారు. ఎంద‌రు పోలీసులు విచార‌ణ చేయ‌వ‌చ్చ‌నే విష‌యాన్ని విలేక‌రులు ప్ర‌స్తావించగా... లోపల ఎంద‌రు పోలీసులు ఉంటారో త‌న‌కు తెలియ‌ద‌ని, తాను లెక్కించ‌లేద‌ని న్యాయ‌వాది అన్నారు.

ఈ ఉదంతం జ‌రిగిన రోజు వారంతా తాగి ఉన్నందున అస‌లేం జ‌రిగిందో ఖ‌చ్చితంగా చెప్ప‌లేమ‌ని న్యాయ‌వాది అన్నారు. అయితే అత్యాచారం జ‌ర‌గ‌లేద‌ని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో న్యాయం జ‌ర‌గ‌డంపై లాయ‌ర్ స్పందిస్తూ కసబ్ లాంటి వాడికే మన దేశం డిఫెన్స్ చేసుకొనే అవకాశం ఇచ్చింది.... ఈ కేసు అంత పెద్దది కాదు కదా అని అన్నారు. తుది తీర్పు వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల‌ని వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News