ఈ టెక్ జమానాలో రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యలు జనాలకు చేరడానికి ఆట్టే పెద్ద సమయం పట్టడం లేదు. అందులోనూ, మన పొలిటిషియన్లు ఏదన్నా కాంట్రవర్సీ విషయాలు మాట్లాడితే అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతోంది. దీంతో, చాలామంది పొలిటిషియన్లు మీడియాముందుకు చుట్టం చూపుగా వస్తుండగా...కొందరు ఆచితూచి మాట్లాడి వెళ్తున్న పరిస్థితి. అయితే, మరికొందరు రాజకీయ నాయకులు ఏదో ఫ్లోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇరకాటంలో పడిపోతుంటారు. ఈ కోవలోనే తెలంగాణలోని జడ్చర్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత అయిన లక్ష్మా రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ప్రజలకు మంచి చేస్తే మరచిపోతారని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రద్దు చేయాలని లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారంటూ మీడియాలో వచ్చిన వార్తలు దుమారం రేపాయి. దీంతో, ఈ వ్యాఖ్యలపై లక్ష్మారెడ్డి తాజాగా స్పందించారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని, ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చుకున్నారు.
ప్రజా సంక్షేమం కోసం పాటుబడే ప్రభుత్వాలను ప్రజలు గుర్తుంచుకోవాలన్న అర్థంలోనే తాను అలా వ్యాఖ్యానించానని, దానిని ఓ వర్గం మీడియా వక్రీకరించిందని లక్ష్మారెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అర్ధం వచ్చేలా తాను నిన్న మాట్లాడానని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు మేలు చేస్తే ప్రభుత్వాలను వారు ఆదరించాలన్న కోణంలో తాను అలా మాట్లాడానని క్లారిటీ ఇచ్చారు. కాగా, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. జనాలకు మంచిచేస్తే మరిచిపోతారని, ఏడాదిపాటు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రద్దు చేయాలని లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించినట్టు ప్రచారం జరిగింది. దీంతో, ఈ వ్యాఖ్యలపై విపక్షాలు విరుచుకుపడగా టీఆర్‌ఎస్ శ్రేణుల్లోనూ అసహనం వ్యక్తమైందన్న ప్రచారం జరిగింది. గులాబీ బాస్ కేసీఆర్ కూడా ఈ కామెంట్లపై సీరియస్ అయ్యారని తెలుస్తోంది. దీంతో, లక్ష్మారెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి, తన కామెంట్ల వల్ల జరిగిన డ్యామేజీకి లక్ష్మారెడ్డి ఇచ్చిన క్లారిటీ సరిపోతుందో లేదో వేచి చూడాలి.