మరో తెలంగాణ ఎమ్మెల్యే కి కరోనా పాజిటివ్!

Update: 2020-08-08 10:10 GMT
తెలంగాణ లో ప్రజాప్రతినిధులను కరోనా వైరస్ భయం వెంటాడుతూనే ఉంది. ఇప్ప‌టికే, రాష్ట్ర వ్యాప్తంగా ప‌లువురు మంత్రులు - ఎమ్మెల్యే - ప్ర‌జా ప్ర‌తినిధులు - సినీ సెల‌బ్రిటీలు వైద్యులు - పోలీసులు కూడా ఈ వైర‌స్ బారిన పడ్డారు. కరోనా భారిన పడకుండా ఎన్ని ర‌కాలుగా జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. ఇక సామాన్యుల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులు, -సెల‌బ్రిటీల‌కు కూడా క‌రోనా సోకుతూండ‌టంతో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌‌న వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయినట్టు ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.

దీంతో ఆయన కుటుంబసభ్యులకు, పనిమనిషికి కరోనా టెస్టులు నిర్వహించారని , ఎమ్మెల్యే భార్య, ఇద్దరు కొడుకులు, వంటమనిషికి కరోనా సోకినట్టు అధికారులు నిర్ధారించారని , దీనితో వైద్యుల సలహా మేరకు ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్ ‌లో ఉన్నారని . ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. ఇక రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తెలంగాణలో కొత్తగా 2256 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 77,513కి చేరింది. మృతుల సంఖ్య 615కి పెరిగింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 54,330కు చేరగా.. ప్రస్తుతం ప్రస్తుతం తెలంగాణలో 22,568 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
Tags:    

Similar News