బ్రిటన్ ప్రధానమంత్రి లిస్‌ట్రస్ రాజీనామాతో కొత్త ప్రధానమంత్రి కోసం అధికార కన్జర్వేటివ్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. కాగా లిస్ ట్రస్‌తో చివరి వరకు ప్రధానమంత్రి పీఠం కోసం పోటీ పడ్డ భారత సంతతి నేత రిషి సునాక్ చివరి క్షణంలో వెనుకుబడి ప్రధాని పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే.
అయితే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లిస్ ట్రస్ దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దలేక, పేదలకు, సంపన్నులకు ఒకే విధమైన పన్ను విధింపులు, రాయితీలు ఇచ్చి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధానిగా ఎన్నికైన 45 రోజులకే ఆ పదవికి రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో రిషి సునాక్ ప్రధాని పదవిని చేపట్టడానికి మార్గం సుగమమైనట్టేనని వార్తలు వచ్చాయి. అయితే ఆయనకు బదులుగా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తాను పోటీ చేస్తానని.. రిషి సునాక్‌ను ఆగిపోమ్మని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.
కాగా ఈసారి ప్రధానమంత్రిని ఎంపిక ప్రక్రియ ఇంతకుముందులా రెండు నెలలు పట్టదని చెబుతున్నారు. వారం లోనే కొత్త ప్రధానిని ఎన్నుకుంటారని పేర్కొంటున్నారు.
కొద్ది నెలల కిందట బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తరవాత కొత్త ప్రధానిని ఎన్నుకునే తతంగం రెండు నెలలపాటు సాగిన సంగతి తెలిసిందే.
కాగా అక్టోబర్ 21న ప్రధాని పదవికి నామినేషన్లు స్వీకరణ మొదలైంది. 650 సీట్లు గల బ్రిటిష్ పార్లమెంటులో అధికార కన్జర్వేటివ్ పార్టీకి 357 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఎవరైనా సరే పార్టీ అధ్యక్ష పదవికీ, తద్వారా ప్రధానమంత్రి పదవికీ పోటీ పడే అవకాశముంది.
ఇంతకుముందు నామినేషన్ వేయడానికి 20 మంది ఎంపీల మద్దతు ఉంటే సరిపోయేది. ఈసారి కనీసం 100 మంది కన్జర్వేటివ్ ఎంపీల మద్దతు ఉన్నవారు మాత్రమే పోటీకి అర్హులని వెల్లడించారు. దీంతో ముగ్గురు నాయకులు మాత్రమే పార్టీ సారథ్యానికి పోటీ పడటానికి అవకాశముంది. కాగా అక్టోబరు 24 మధ్యాహ్నం 2 గంటలతో నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది. అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5.30 గంటల లోపల పార్టీ ఎంపీలు ఓటు వేస్తారు.
అక్టోబర్ 24న ముగ్గురు అభ్యర్థులలో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో సాయంత్రం 6 గంటలకు ప్రకటిస్తారు. అందరికన్నా తక్కువ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థి పోటీ నుంచి తప్పుకుంటారు.
ఇక పోటీలో మిగిలిన ఇద్దరికి ఎంపీలు సూచనాత్మక ఓట్లు వేస్తారు. ఇద్దరు అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా ఉన్న 1,72,000 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా ప్రధానిని ఎంచుకుంటారు. అక్టోబర్ 28న విజేతను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఎన్నికైనవారిని కొత్త ప్రధానమంత్రిగా బ్రిటిష్ రాజు ప్రకటిస్తారు.
ప్రధాని పదవి కోసం ఇటీవల ట్రస్‌తో పోటీపడి ఓడిపోయిన మాజీ ఆర్థిక మంత్రి రిషీ సునాక్ కొత్త ప్రధానిగా ఎన్నికవుతారని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అప్పట్లో ట్రస్, సునాక్‌లతో నాయకత్వం కోసం పోటీ పడిన ప్రస్తుత ఆర్థిక మంత్రి జెరెమీ హంట్ ఈసారి తాను పోటీ నుంచి విరమించుకున్నట్లు ప్రకటించారు. రక్షణ మంత్రి బెన్ వాలెస్ కూడా తాను పోటీలో ఉండబోనని ఇప్పటికే తేల్చిచెప్పారు. ఎంపీల మద్దతు రిషి సునాక్‌కే ఎక్కువగా లభించొచ్చని భావిస్తున్నారు.
మరోవైపు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ మళ్లీ అధికారం చేపట్టాలని కోరుకునేవారూ ఎక్కువగానే ఉన్నారు. బోరిస్‌కు మద్దతివ్వాలంటూ ప్రచారం ఆయన అనుచరులు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టడం గమనార్హం. అయితే రిషి సునాక్‌తో పోలిస్తే బోరిస్ జాన్సన్‌కు అంత క్రేజ్ లేదని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.