ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకి రంగం సిద్ధమైంది. మూడు దఫాలుగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒకే దశలో మున్సిపల్ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఆ తరువాత రెండు ధపాలుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక ఎన్నికల కోడ్ కూడా ఏపీలో ఇప్పటికే అమల్లోకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు , మద్యం ఏరులై పారడం సహజమే. లోకల్ లీడర్ల మధ్య జరిగే ఎన్నికలు కావడం తో గెలవడాని కి ఏం చేయడానికైనా కూడా వెనుకాడరు.
దీనితో ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు చెక్ పెట్టాలని , అవినీతి లేకుండా చూడాలని సీఎం జగన్ ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ముఖ్యమైనది ఎన్నికలు. రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నికలల్లో కూడా డబ్బు , మధ్య ప్రభావం చూపకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. అయితే ,కొన్ని పార్టీలు డబ్బు, మద్యం ఇచ్చి ప్రలోభ పెట్టి..ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాయి. దీనితో తాజాగా జరగబోయే ఎన్నికల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు...‘నిఘా’ పేరిట పంచాయతీ రాజ్ శాఖ ఓ యాప్ ను ముందుకు తీసుకొచ్చింది.
2020, మార్చి 07వ తేదీ శనివారం ఈ యాప్ ను లాంచ్ చేసారు. ఈ యాప్ తో ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకుంటాన్నయనే విషయాన్ని ఉన్నతాధికారులకు కంప్లయింట్ చేయవచ్చు. ఎన్నికల నియామవళిని అతిక్రమించి, అభ్యర్థులు ఓటర్లను బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేసినట్లయితే , వారు ఒకవేల గెలుపొందినా కూడా పదవుల్లో కొనసాగడానికి వారిని అనర్హులుగా ప్రకటించడంతో ఆరేళ్ల పాటు, తిరిగి పోటీ చేయకుండా ఉండేలా ఏపీ ప్రభుత్వం ఇటీవలే చట్టం తీసుకొచ్చింది. వారికి మూడేళ్ల పాటు జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానాను విధించనున్నారు.
ఇకపోతే అసలు ఈ మొబైల్ యాప్ వల్ల ఉపయోగం ఏమిటంటే ..త మ కళ్ల ముందు..జరిగిన అక్రమాలకు సంబంధించిన..ఫొటో, వీడియోలను యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. కంప్లయింట్ చేసే వారు తమ వ్యక్తిగత సమాచారం ఇష్టం ఉంటేనే తెలియజేయవచ్చు. ఎవరైనా ఫిర్యాదు చేసిన వెంటనే ...ఆ ఫిర్యాదుని GPS ద్వారా గుర్తించి అధికారులు చర్యలు తీసుకుంటారు. ఆ తరువాత ఆ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే కూడా మీరు ఆ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.