ఎమ్మెల్యే - ఎంపీలే కబ్జా రాయుళ్లా?

Update: 2020-08-25 17:30 GMT
మొన్నటి వర్షాలకు వరంగల్ నగరం మునిగిపోయింది. కాకతీయులు కట్టించిన చెరువులు, నాలాలు ఆక్రమించిన నేతల వల్లే ఈ దుస్థితి నెలకొందని ప్రజలు ఆరోపిస్తున్నారు. దశాబ్ధాలుగా కబ్జాలు సాగాయని.. ఇప్పుడు నాలాలపై ఆక్రమణలు కూలిస్తే వచ్చే ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

వరంగల్ నగరం మునిగిపోవడానికి ఇక్కడ పాలించిన రాజకీయ నేతలే కారణం అన్నది బహిరంగ రహస్యమే.. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నేతలు.. వారి అనుచరులు రియల్ దందాకు ఎగబడి చెరువులు, నాలాలు మాయం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు వీటికి సహకరించారని అంటున్నారు.

వరంగల్ లో ఓ ఎమ్మెల్యే అనుచరుల భూ కబ్జాల బాగోతంపై ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. వారు ఆక్రమణ దారులని తెలిసినా ఎమ్మెల్యేలు ప్రోత్సహిస్తుండడంతో పోలీసులు, అధికారులు మారు మాట్లాడడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇందులో ఓ ఎంపీ అనుచరుల కబ్జాలు కూడా ఉన్నాయని వరంగల్ లో ప్రచారం సాగుతోంది. భద్రకాళీ చెరువును కబ్జా చేసి ఓ నేత క్యాంపు కార్యాలయం కట్టుకున్నా అధికారులు అక్కడ కూల్చడం లేదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. 40 ఏళ్లుగా అన్ని పార్టీల నేతల ఎమ్మెల్యేలు, ఎంపీల అనుచరులు కబ్జాలు చేశారని.. కూల్చివేతలు అన్ని చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Tags:    

Similar News