ఏపీలో గత రెండు నెలలుగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియలో రాజకీయ నాయకుల మధ్య ప్రభుత్వ ఉన్నతాధికారులు నలిగిపోతున్నారు. నాయకుల రాజకీయ ప్రాబల్యం కోసం ఐఏఎస్ లను పావులుగా మార్చుకుంటుండడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఐఏఎస్ లు రాష్ట్రంలో పనిచేయడం కంటే కేంద్ర సర్వీసుల్లో కొనసాగడమే నయమని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అలాగే ఉన్నతాధికారులకు ఇబ్బందులపై రిటైర్డ్ అధికారులు ఖండిస్తూ ప్రకటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
కొంతకాలం కిందట జగన్ పై విశాఖ ఏయిర్ పోర్టులో కోడికత్తితో దాడి.. ఆ తరువాత వైఎస్ వివేకానంద హత్యలో అధికారులు టీడీపీకి వత్తాసు పలుకుతున్నారని ఆ పార్టీ అధినేత జగన్ ఆరోపించారు. దీంతో ఏపీ డీజీపీ ఠాకూర్ ను, పోలీస్ ఇంటెలీజెన్స్ చీఫ్ వెంకటేశ్వర్ రావుతో పాటు కొందరు ఎస్పీలను మార్చాలని వైసీపీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో వెంకటేశ్వర్ రావును, కొందరు ఎస్పీలను బదిలీ చేసింది ఈసీ. అయితే వెంకటేశ్వర్ రావు విషయంలో ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లినా ఈసీదే పైచేయి నిలిచింది.
అయితే తమ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లారన్న ఈసీ ఏపీ సీఎస్ ను పునైటాను తప్పించింది. ఆయన స్థానంలో సీనియర్ అధికారి అయిన ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమించింది. ఈ నియామకంపై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. జగన్ కేసుల్లో సహ నిందితుడిగా ఉన్న సుబ్రహ్మణ్యంను సీఎస్‌గా ఎలా నియమిస్తారని ఆరోపించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. వైసీపీ, బీజేపీలకు సహకరించడానికే ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమించారన్నారు.
అయితే చంద్రబాబు ఆరోపణలపై రిటైర్డ్ అధికారులు తప్పుబడుతున్నారు. కోర్టు కేసులు కొట్టివేసినా ఎల్వీ సుబ్రహ్మణ్యంను సహ నిందితుడని స్వయంగా ముఖ్యమంత్రి పేర్కొనడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాశారు రిటైర్డ్ అధికారులు. అలాగే గవర్నర్‌ను కలిసి ఫిర్యాదులు చేయాలనుకుంటున్నారు.
ఇలా రాష్ట్రంలో రాజకీయ నాయకుల మధ్య నలిగిపోవడం కంటే కేంద్ర సర్వీసుల్లో వెళ్లి పనిచేయడం బెటరని కొందరు ఐఏఎస్ అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో పనిచేయడానికే జంకుతున్న అధికారుల వైనం.. టీడీపీ ప్రభుత్వంలో నెలకొందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు.