అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గురించి ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. మనసులో అనుకున్నది అనుకున్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం జేసీ నైజం. స్వపక్షమైనా - ప్రతిపక్షమైనా... పొగడ్తయినా... విమర్శయినా....ఒన్స్ జేసీ మైండ్ లో ఫిక్సయితే బ్లైండ్ గా ఫాలో అయిపోతారు. అయితే, చాలా సార్లు జేసీ తన వివాదాస్పద వ్యాఖ్యలు - ప్రవర్తనతోనే వార్తల్లో నిలుస్తుంటారు. అందరితో టెలీకాన్ఫరెన్స్ ఏంది సార్...ఆ కాన్సెప్ట్ మానుకోకపోతే ఇబ్బంది పడతారంటూ నిండు `మహానాడు` సభలో చంద్రబాబునుద్దేశించి జేసీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో ఇద్దరే మంత్రులని...ఒకరు ముఖ్యమంత్రి - మరొకరు ప్రధాన మంత్రని...జేసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. అదే తరహాలో కమ్యూనిస్టులు దొంగలంటూ జేసీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. జేసీ వ్యాఖ్యలపై వామపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. జేసీ ఒక మానసిక రోగి అని, ఆ వ్యాఖ్యలపై కమ్యూనిస్టులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
గత కొంతకాలంగా జేసీ చేసిన పలు వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులు దొంగలంటూ...జేసీ చేసిన వ్యాఖ్యలపై వామపక్ష నేతలు నిప్పులు చెరిగారు. తమకు జేసీ క్షమాపణలు చెప్పాలని - లేకుంటే ఆయనను టీడీపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. జేసీ కన్నా పెద్ద దొంగ రాష్ట్రంలో మరొకరు లేరని వారు ఎద్దేవా చేశారు. ఒక బస్సుకు పర్మిషన్ తీసుకొని నాలుగు బస్సులు నడుపుతున్న దొంగ జేసీ అని - బినామీల పేరుతో వందల ఎకరాల భూములు కాజేసిన సిమెంట్ ఘనుడు జేసీ అని మండిపడ్డారు.
టీడీపీ ఎంపీలు - ఎమ్మెల్యేలు వెధవలు అని జేసీ వ్యాఖ్యానించారని - వారి అధినేత చంద్రబాబు ఏమిటో కూడా జేసీ సెలవివ్వాలని అన్నారు. వామపక్ష నేతలు ఎక్కడ దొంగతనం చేశారో జేసీ వెల్లడించాలని సవాల్ విసిరారు. రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి జేసీ అని - జేసీ....కల్లు తాగిన కోతివంటివాడని మండిపడ్డారు. జేసీ క్షమాపణ చెప్పకుంటే ఆయనపై కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు.