పాశ్చాత్య దేశాలకే పరిమితం అనుకున్న అసహజ ధోరణులు ఇండియాకు కూడా పాకుతున్నాయి. అందులోనూ ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘటన వెలుగు చూడడంతో పాటు వివాదానికి తెరతీసింది. విశాఖపట్టణంలోని గాజువాకలోని పారిశ్రామిక ప్రాంతంలో ఓ మహిళ ఓ పదహారేళ్ల బాలికను వివాహం చేసుకోవడం కలకలం రేపింది. పరిచయమైన వారం రోజుల్లోనే బాలికను లొంగదీసుకుని ఎత్తుకెళ్లి వివాహం చేసుకున్న మహిళ ఉదంతం అందరినీ షాక్ కు గురిచేసింది. ఎల్మాజీ అలియాస్ తేజ (30) అనే మహిళ తన కూతురికి పరిచయమై ఇంత పని చేసిందని బాలిక తల్లి ఆరోపిస్తోంది. 15 రోజులుగా తన కూతురితో పరిచయం పెంచుకున్న తేజ 8 రోజుల క్రితం బాలికను తీసుకెళ్లి తిరుపతిలో వివాహం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో వారే ఆమె కోసం గాలించి తిరుపతిలో వారిని పట్టుకున్నారు.
విశాఖలోని జాలారిపేట గ్రామానికి చెందిన కె.ఎలమాజీ అలియాస్ తేజ అనే మహిళ మూడు నెలల క్రితం పెదగంట్యాడ మండలం కొత్త దిబ్బపాలెం వచ్చింది. ఆమె ఆన్ లైన్ బిజినెస్ చేస్తూ ద్విచక్ర వాహనంపై గాజువాక పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండేది. ఈ నేపథ్యంలో గాజువాకలో ఒక దుస్తుల దుకాణంలో పని చేస్తున్న 16 ఏళ్ల బాలికతో పరిచయం పెంచుకుంది. రోజూ ఆ బాలికను తేజ తన బండిపై తీసుకు వెళ్లడం, తీసుకు రావడం చేసేది. పది రోజుల క్రితం మైనర్ బాలికను తేజ ఎవరికీ చెప్పకుండా విజయవాడ - తిరుపతి తీసుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు తాము కూడా అన్వేషణ మొదలుపెట్టారు. బాలిక తమ్ముడికి తేజ ఫోన్ నెంబర్ దొరకడంతో ఆ కుర్రాడు ఫోన్ చేసి అమ్మానాన్న ఆరోగ్యం బాగోలేదని, ఇంటిలో తినడానికి తిండి లేదని, నీ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పాడు. దీంతో ఆ బాలిక రెండ్రోజుల్లో గాజువాక వస్తానని చెప్పింది.
శనివారం బాలిక - తేజ గాజువాక చేరుకోగా బాలిక బంధువులు తేజను పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. కాగా ఒక మహిళ ఇలా బాలికను పెళ్లి చేసుకోవడం విశాఖలో సంచలనం రేపింది. ఈ ప్రాంతంలో ఇంతవరకు ఇలాంటివి జరగలేదని.. ఎక్కడో జరిగినట్లుగా పత్రికల్లో చదవడం, టీవీల్లో చూడడం తప్ప ఎన్నడూ ఇలాంటివి చూడలేదని అంటున్నారు.