భారత్ లో పది శాతం కంటే తక్కువగా ప్రేమ వివాహాలు

Update: 2021-12-09 23:30 GMT
భారతదేశం వివిధ కులాలకు, మతాలకు, భాషలకు పుట్టినిల్లు. ప్రేమకు చిహ్నం గా ఉండే తాజ్ మహల్ మన దేశంలోనే ఉంది. అయితే ప్రేమ వివాహం చేసుకునే వారి సంఖ్య భారతదేశంలో తక్కువ అని ఇటీవల నిర్వహించిన సర్వే స్పష్టం చేసింది. భారతదేశంలో ఎక్కువ మంది పెద్దలు కుదిర్చిన వివాహం మొగ్గుచూపుతున్నట్లు ఈ సర్వే పేర్కొంది. ప్రముఖ జర్నలిస్ట్ రుక్మిణి ఇందుకు సంబంధించిన డేటాను ఇటీవల విడుదల చేశారు.

ఓ మీడియా సంస్థ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచురించింది. దీనిలో అనేక కీలక అంశాలు వెల్లడైనట్లు సంస్థ తెలిపింది. మన దేశంలో ఎక్కువ మంది ప్రేమించడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. అయితే వీరంతా వివాహం దగ్గరికి వచ్చేసరికి తల్లిదండ్రులు కుదిర్చిన దానికే ఓటు వేస్తున్నట్లు సర్వే తెలిపింది.

భారత్లో సుమారు 93 శాతానికి పైగా పెళ్ళిళ్ళు పెద్దలు కుదిర్చిన అని సర్వే స్పష్టం చేసింది. అంతేకాకుండా మరో మూడు శాతం పెళ్లిళ్లు ప్రేమ వివాహాలు కావడం గమనార్హం. మరో మూడు శాతానికి పైగా వివాహాలు లవ్ ప్లస్ అరేంజ్డ్ గా ఉన్నాయి. ప్రేమ ప్రారంభదశలో బాగానే ఉన్నాం వారు ఇంట్లో పెద్దలకు ప్రేమ విషయం చెప్పడానికి ఆలోచిస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.

అంతేకాకుండా పెళ్లి విషయంలో పెద్దలు ఎక్కడ బాధ పడతారో అనే ఆలోచనతో చాలామంది యువతీ, యువకులు తల్లిదండ్రులు చెప్పినా వారిని వివాహం చేసుకుంటున్నట్లు స్పష్టమైంది.

తల్లిదండ్రులు కుదిర్చిన వివాహం చేసుకునేందుకు కొంతమంది విముఖత వ్యక్తం చేసిన వివిధ కారణాల వల్ల వారు వివాహం చేసుకోవాల్సి వచ్చిందని సర్వే లో వెల్లడయింది. అంతేకాకుండా మరి కొంతమందిని తల్లిదండ్రులే బలవంతంగా ఒప్పించి పెళ్లిళ్లకు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ సర్వేను భారత్ లోని సుమారు లక్ష 70 వేల కుటుంబాలపై జరిపినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

పెళ్లి విషయంలో చాలా పట్టింపు గా ఉండే కులం గురించి కూడా ఈ సర్వే కీలక అంశాలను వెల్లడించింది. మన దేశంలో ఎక్కువ మంది ఇతర కులాల కు చెందిన వారిని ప్రేమించేందుకు ఇష్టపడుతున్నా... వివాహం వరకు వచ్చేసరికి వారి అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు తేలింది.

ఎక్కువ మంది తమ కులానికి చెందిన వారిని పెళ్లి చేసుకుంటున్నట్లు స్పష్టమైంది. నగరంలో నివసించే వారిలో కేవలం 10 శాతం మంది మాత్రమే కులం గురించి ఆలోచించడం లేదు. అంతేకాకుండా కేవలం 5 శాతం మంది మతం గురించి ఆలోచించడం లేదని కూడా సర్వే పేర్కొంది.

2015 లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం మ్యాట్రిమోనీ వెబ్సైట్లో సంబంధాలు వెతికే వారిలో ఎక్కువమంది ఇతర కులాలకు చెందిన వారిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తేలింది.

కానీ నీ పెళ్లి వరకు వచ్చేసరికి ఎక్కువమంది సొంత కులానికి చెందిన వారినే చేసుకుంటున్నట్లు స్పష్టమైంది. అన్ని అర్హతలూ ఉన్నటువంటి దళిత పెళ్లి కొడుకులను ఎక్కువమంది ఎంచుకోవడానికి వెనక ఆడుతున్నట్లు సర్వే స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే లవ్ జిహాద్ పేరుతో భాజపా అధికారంలో ఉన్నా కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక చట్టాలు తీసుకొని వచ్చింది. ఈ చట్టం ప్రకారం ముస్లిం మతానికి చెందిన అబ్బాయిలు హిందూ మతానికి చెందిన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకోవడం ద్వారా వారిని మతం మార్చితే.. వారిపై చర్యలు తీసుకోవాలని చట్టం చెప్తుంది.

ఏది ఏమైనా నా ప్రేమ వివాహాల కంటే మన దేశంలో పెద్దలు కుదిర్చిన వివాహాలు ఎక్కువ జరుగుతున్నాయని ఈ సర్వేతో స్పష్టమయింది.
Tags:    

Similar News