అబ్బాయిలు 18 ఏళ్ల‌కే పెళ్లి చేసుకోవ‌చ్చు?

Update: 2018-09-01 05:13 GMT
స్త్రీ.. పురుషుల మ‌ధ్య నిజ‌మైన స‌మాన‌త్వాన్ని సాధించాలంటే..?  మిగిలిన విష‌యాల్ని ప‌క్క‌న పెడితే.. అమ్మాయికి క‌నీస వివాహ అర్హ‌త 18 ఏళ్ల‌కు వ‌స్తే.. అబ్బాయిల‌కు మాత్రం 21 ఏళ్ల‌కు. స్త్రీపురుషులిద్ద‌రికి నిజ‌మైన స‌మాన‌త్వం అంటే.. ఇరువురికి ఒకే వ‌య‌సులో పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే విష‌యాన్ని తాజాగా లా క‌మిష‌న్ ఆఫ్ ఇండియా  భార‌త ప్ర‌భుత్వానికి సిఫార్సు చేసింది.

ప్ర‌స్తుతం ఉన్న చ‌ట్టాల ప్ర‌కారం అమ్మాయికి వివాహ వ‌య‌సు 18 ఏళ్లు అయితే.. అబ్బాయిల‌కు క‌నీస వివాహ వ‌య‌సు 21 ఏళ్లుగా ఉండ‌టం తెలిసిందే. అయితే.. దీన్ని 18 ఏళ్ల‌కు కుదించాల‌ని లా క‌మిష‌న్ కోరింది. ఈ సిఫార్సును చ‌ట్టంలో మారిస్తే.. అమ్మాయి.. అబ్బాయి ఇద్ద‌రూ 18 ఏళ్ల‌కే పెళ్లి చేసుకునే వీలు క‌లుగుతుంది.

నిజ‌మైన అర్థంలో స‌మాన‌త్వం కోసం స‌మ్మ‌తి క‌లిగిన వ‌యోజుల మ‌ధ్య వివాహానికి వేర్వేరు వ‌య‌సులు ఉండాల‌న్న విధానాన్ని మార్చాల‌ని పేర్కొంది. ఇండియ‌న్ మెజారిటీ యాక్ట్ 1875 ప్ర‌కారం మెజారిటీ వ‌య‌సు 18 ఏళ్లు అని.. స్త్రీ.. పురుషులిద్ద‌రికి ఇది వ‌ర్తిస్తుంద‌ని పేర్కొంది.

అదే స‌మ‌యంలో.. వివాహ వ‌య‌సు కూడా ఇరువురికి 18 ఏళ్లుగా ఉండాల‌ని పేర్కొంది. అయితే.. అందుకు భిన్నంగా ఇప్పుడు వేర్వేరు వ‌య‌సులో క‌నీస వివాహ వ‌య‌సుగా చ‌ట్టంగా ఉంది. దీన్ని మార్చాల‌ని లా కమిష‌న్ తాజాగా సిఫార్సు చేసింది.  భార‌త స‌ర్కారు ఈ సిఫార్సును చ‌ట్టంగా మారిస్తే.. అబ్బాయిలు 18 ఏళ్ల‌కే పెళ్లి చేసుకునే వీలుంటుంది.
Tags:    

Similar News