అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణతో పాటు ఏపీ వాసి మృతిచెందిన విషయం తెలిసిందే. వారి మృతదేహాలు ఇంకా భారతదేశానికి రాలేదు. మృతదేహాల కోసం ఆ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. దీంతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మృతదేహాలను త్వరగా భారతదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరార. తెలుగు వారిని స్వదేశం తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌కు లేఖ రాశారు.
హైదరాబాద్ ముషీరాబాద్ గాంధీనగర్ కు చెందిన రాజా గవిని, దివ్య ఆవుల భార్యాభర్తలు. వీరిద్దరూ అమెరికా టెక్సాస్‌లోని ప్రిస్కోలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేస్తూ అక్కడే నివసిస్తున్నారు. వారి స్నేహితుడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రేమనాథం రామనాథ్ తో కలిసి కారులో సోమవారం ఉదయం ప్రయాణిస్తుండగా టెక్సాస్‌లో ట్రక్ వచ్చి ఢీకొనడంతో వారంతా మృతిచెందారు. ముగ్గురు అక్కడికక్కడే చనిపోవడంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన వారు మృతదేహాలుగా తిరిగి వస్తుండడంతో కన్నవాళ్లు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాల కోసం వారు ఎదురు చూస్తుండడం.. ఆ మృతుల కుటుంబాల తన నియోజకవర్గ పరిధిలోని వారే కావడంతో వెంటనే లక్ష్మణ్ కేంద్రానికి లేఖ రాశారు.
అమెరికాలోని రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపి.. మృతదేహాలను వీలైనంత తర్వగా భారత్ తరలించాలని లక్ష్మణ్ కోరారు. ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి కూడా ఉత్తరం పంపారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో చర్చించారు. వెంటనే మృతదేహాలు తెప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ ప్రమాదంతో మూడు తెలుగు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.