సీఎం కేసీఆర్‌కు ఉత్త‌మ్ సంచ‌ల‌న లేఖ‌.. తీవ్ర విమ‌ర్శ‌లు

Update: 2022-05-29 16:30 GMT
సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ పీసీసీ మాజీ చీఫ్ సంచ‌ల‌న లేఖ రాశారు. తీవ్ర‌స్తాయిలోపైసీఎం పై ఫైర‌య్యారు. ఐదో విడత పల్లె ప్రగతి మొదలు పెట్టక ముందే గ్రామాలకు రావాల్సిన పల్లె ప్రగతి బిల్లులను చెల్లించాలని ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉత్తమ్ లేఖ రాశారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఆ పనులు చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారని తెలిపారు.

రాష్ట్రంలో ఐదో విడత పల్లె ప్రగతిని ప్రారంభించేందుకు సమాయత్తవుతున్న రాష్ట్ర ప్రభుత్వం అంతకు ముందు నిర్వహించిన పల్లెప్రగతి బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి లేఖ రాశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గ్రామ పంచాయతీలలో ఐదో విడత పల్లె ప్రగతి నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం సన్నద్ధమవుతుండడంతో ఈ లేఖను రాశారు.

గతంలో నిర్వహించిన పల్లె ప్రగతి పనులకు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో పది లక్షల వరకు బిల్లులు ఇవ్వాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఆ పనులు చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారని తెలిపారు.

సిబ్బంది జీతాలు, డీజిల్‌ బిల్లులు, కరెంట్ బిల్లులు, ట్రాక్టర్ నిర్వహణకు సైతం చెల్లించే పరిస్థితి పంచాయతీల్లో లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి పనుల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు.

మండల పరిషత్‌లో పని చేసే బోర్ మెకానిక్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు జీతాల చెల్లింపునకు కూడా గ్రామ పంచాయతీలకు నిధులు లేవని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రభుత్వం చెప్పిన పనులను చేసిన వాటికి బిల్లులు చెల్లించడంలో తీవ్ర కాలయాపన వల్ల గ్రామ సర్పంచ్‌లు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేకనే అత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు దాపురించాయన్న ఆయన.. ఐదో విడత పల్లె ప్రగతి మొదలు పెట్టక ముందే గ్రామాలకు రావాల్సిన పల్లె ప్రగతి బిల్లులను చెల్లించాలని డిమాండ్‌ చేశారు.
Tags:    

Similar News