చరిత్రకు సాక్ష్యాలు చాలా ఉంటాయి.. అందులో ముఖ్యమైనవి లేఖలు.. వీటిలో చాలా లేఖలు రహస్యంగా ఉంచుతారు.. దేశ రాజకీయాలు.. దౌత్య పరమైన సంబంధాలు.. కుట్రలు.. ఇటువంటి వన్నీ.. ఆ లేఖల్లోనే ఉండేవి. అందుకే వాటిని ఏ దేశాలూ బహిర్గతపరచవు. చైనాకు చెందిన ఒక అరుదైన లేఖ ఏకంగా ఆరున్నర కోట్లకు అమ్ముడబోయింది. చైనా కమ్యూనిస్టు వ్యవస్థాపక నాయకుడు మావో జెడాంగ్ 1937లో బ్రిటన్ లేబర్ పార్టీ నాయకుడు క్లెమెంట్ అట్లీకి రాసిన ఈ ఆరుదైన లేఖ ఆరున్నర కోట్ల రూపాయలకు వేలం పాటలో అమ్ముడు పోయి రికార్డు క్రియేట్ చేసింది.
చైనాకు చెందిన ఓ వ్యాపారి ఈ లేఖను కొనుగోలు చేసినట్టు వేలం సంస్థ ‘సోత్ బై’ వెల్లడించింది. అయితే ఆ వ్యాపారి పేరును మాత్రం వెల్లడించలేదు. చైనాపై దురాక్రమణకు వచ్చిన జపాన్ సైన్యాన్ని తిప్పికొట్టేందుకు కావాల్సిన సహాయం అందించాల్సిందిగా... ఈ దిశగా బ్రిటన్ సైన్యాన్ని ఒప్పించాల్సిందిగా ఆ లేఖలో క్లెమెంట్ ను మావో కోరారు. అంతర్జాతీయ దౌత్యానికి సంబంధించి అప్పట్లో మావో రెండే రెండు లేఖలపై సంతకం చేశారు. అందులో ఇప్పుడు అమ్ముడు పోయిన లేఖ ఒకటి. ఈ లేఖకు తాము కోటిన్నర రూపాయలు వస్తాయని ఆశించామని, అయితే ఆశ్చర్యంగా ఆరున్నర కోట్ల రూపాయలు రావడం విశేషమని వేలం సంస్థ నిర్వాహకులు వ్యాఖ్యానించారు.