సీఎంల్ని చంపుతామనే లేఖ వచ్చిందెక్కడ నుంచి?

Update: 2015-10-13 04:36 GMT
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను చంపేస్తాం.. ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాల్ని పేలుస్తాం.. విమానాశ్రయాలతో పాటు.. శ్రీహరికోటలోని షార్ కేంద్రానికి బాంబుదాడి తప్పదంటూ వచ్చిన బెదింపు లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది.

తెలుగులో రాసిన లేఖ.. ఎక్కడ నుంచి వచ్చి ఉంటుందన్న విషయంపై పోలీసులు దృష్టి సారించారు. విధ్వంసాల్ని సృష్టిస్తామని చెబుతున్న లేఖ మీద ఆరా తీసిన పోలీసులు.. సదరు లేఖ తెలంగాణలోని అదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి వచ్చినట్లుగా భావిస్తున్నారు. బెదిరింపు లేఖలు అటు ఏపీకి.. ఇటు తెలంగాణకు రావటం గమనార్హం.

ఈ ఉత్తరాల్ని రాసిన వ్యక్తి నిర్మల్ కు చెందిన వ్యక్తిగా భావిస్తున్నరు. ఇందులో భాగంగా ఒక అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. బెదిరింపు లేఖల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల పోలీసుల.. నిఘా విభాగం మరింత అప్రమత్తమైంది. ఈ బెదిరింపు లేఖల వెనుక ఎవరున్నారన్న విషయం మరికొద్ది రోజుల్లో తేలుతుందని చెబుతున్నారు.
Tags:    

Similar News