కొందరికి అలా కలిసి వస్తుందంతే. సరదాగానో.. వ్యాపకంతోనే కొనే కొన్ని వస్తువులు ఊహించని రీతిలో లాభంగా మారతాయి. అనుకోని పేరు ప్రతిష్ఠల్ని తీసుకొస్తాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. అప్పుడెప్పుడో 1964లో సరదాగా కొన్న పాతకాలపు పావు తాజాగా రూ.6.5 కోట్ల విలువ చేయటం గమనార్హం. కేవలం ఐదు పౌండ్లు.. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.430 కొనుగోలు చేసిన పావు ఇప్పుడు అంతకు లక్షల రెట్లు అధికంగా పలికి ఏకంగా ఆరున్నర కోట్ల రూపాయిలు పలకటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సుమారు 900 ఏళ్ల నాటి లెవిస్ చెస్ మ్యాన్ పావును 1964లో ఒక వ్యక్తి రూ.430 పెట్టి కొనుగోలు చేశాడు. సైనిక యోధుడి రూపంలో ఉండే ఈ పావు 8.8 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. 12వ శతాబ్దానికి చెందిన వార్లస్ అనే సముద్రజంతువు దంతంతో తయారు చేసినట్లుగా చెబుతున్నారు.
నార్నె యోధుల రూపంలో ఉంటే ఈ పావులు చాలా అరుదైనవిగా చెబుతారు యూరోపియన్ చరిత్రలో వైకింగ్ శకానికి చెందిన ఈ కళాకృతులకు మంచి డిమాండ్ ఉంది. మార్కెట్లో చాలా ఎక్కువ ధర పలుకుతాయని చెబుతారు. ఈ పావును తొలుత స్కాటిష్ ప్రాచీన కళాకృతుల డీలర్ వద్ద వీటిని కనుగొన్నారు. ఇలాంటి చదరంగం పావులు 1831లో స్కాట్లాండ్ లోని ఇస్లే ఆఫ్ లెనిన్ లోపెద్ద ఎత్తు దొరికాయి. మొత్తం ఐదు సెట్ల చెస్ పావులు అక్కడ లభించాయి.
ఇదిలా ఉంటే.. వీటిల్లో ఒక పావు అదృశ్యమైంది.
అప్పటి నుంచి ఈ పావు పలువురు చేతుల నుంచి మారింది. చివరకు తాజాగా లండన్ లో జరిగిన వేలంపాటకు వచ్చింది. ఎడిన్ బర్గ్ కు చెందిన డీలర్ వద్ద సదరు చెస్ పావును అప్పట్లో ఐదు పౌండ్లకు కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. తాజాగా జరిగిన వేలంపాటలో గుర్తు తెలియని ఒకరు భారీ మొత్తంతో కొనుగోలు చేయటంతో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారి.. అందరి నోట్లో నానుతోంది.