ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారు దొంగతనం కథ కొత్త మలుపు తిరిగింది. ఈ నెల 12న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు చెందిన బ్లూ వాగన్ ఆర్ కారును ఎవరో దొంగిలించిన విషయం తెలిసిందే. రెండు రోజుల తర్వాత ఘజియాబాద్ లో ఆ కారు దొరికింది. కారు పోయిన మరుసటి రోజే గవర్నర్ కు కేజ్రీవాల్ లేఖ రాశారు. ``సీఎం కారు ఎత్తుకెళ్తేనే దిక్కులేదు.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఢిల్లీ శాంతి భద్రతలు మరీ దిగజారిపోతున్నాయి.. కాస్త ఈ విషయంపై మీరు సీరియస్‌గా దృష్టి సారించాల్సిందే``.. ఇదీ కొన్ని రోజుల కిందట ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కు రాసిన లేఖ సారాంశం. దానికి ఇవాళ లెఫ్టినెంట్ జనరల్ కౌంటర్ ఇచ్చారు. పార్కింగ్ స్థలాలలోనే కార్లను పార్క్ చేస్తే బాగుంటుంది.. అప్పుడు ఇలాంటివి జరగవు అంటూ ఆయన రిప్లె ఇచ్చారు. అధికారిక పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలను పార్క్ చేసేలా మీరు కూడా ఢిల్లీ పోలీసులకు సహకారం అందిస్తే బాగుంటుంది అని బైజాల్.. కేజ్రీవాల్ కు సూచించారు.
సీఎం కారునే ఎత్తుకెళ్తే సామాన్యుడి పరిస్థితి ఏంటి? శాంతిభద్రతల అంశం పూర్తిగా మీ పరిధిలోకి వస్తుంది కాబట్టి.. కాస్త మీరు ఆ విషయాన్ని చూడాలి అని కేజ్రీవాల్ ఆ లేఖలో అనిల్ బైజాల్ ను కోరారు. దీనికి బైజాల్ రిప్లై ఇస్తూ.. ఆథోరైజ్డ్ పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలు పార్కింగ్ చేసేలా పోలీసులకు సహకరించండి. అంతేకాదు మీ కారును తిరిగి సంపాదించిపెట్టిన పోలీసులను అభినందించండి అని చెప్పారు. గవర్నర్ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.