నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్.. ఎల్ఐసీ ఉద్యోగుల ఆగ్ర‌హం!

Update: 2020-02-02 04:09 GMT
కేంద్ర బ‌డ్జెట్ లో డిజెన్వెస్ట్ మెంట్ లో భాగంగా.. ఎల్ఐసీ ఐపీవోకు వెళ్లాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించ‌డం ప‌ట్ల ఆ సంస్థ ఉద్యోగుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతూ ఉంది. ఎల్ఐసీ షేర్ల‌ను అమ్మ‌డాన్ని ఆ సంస్థ ఉద్యోగులు వ్య‌తిరేకిస్తూ ఉన్నారు. ద‌శాబ్దాలుగా ప్ర‌భుత్వ రంగ సంస్థ‌గా ఎల్ఐసీ రాణిస్తూ ఉంది.

భారీ లాభాల‌ను కూడా ఆర్జీస్తూ ఉంది ఈ సంస్థ‌. ఆ లాభాలు వేల కోట్ల రూపాయ‌ల్లో ఉన్నాయి. అలాగే దేశంలో భారీ ఎత్తున ఆస్తుల‌ను క‌లిగి ఉన్న సంస్థ‌ల్లో ఒక‌టి ఎల్ఐసీ.  ద‌శాబ్దాలుగా అదొక విశ్వ‌స‌నీయ‌మైన ప్ర‌భుత్వ రంగ సంస్థ‌గా కొన‌సాగుతూ ఉంది. అదే స‌మ‌యంలో.. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి పోటీని ఎదుర్కొంటూ లాభాల‌ను కూడా సాధిస్తూ ఉంది.

ఈ విజ‌యంలో ఎల్ఐసీ ఉద్యోగుల క‌ష్టం ఎంతో ఉంటుంది. ఎన్నో ర‌క‌లా టార్గెట్ ల‌ను పెట్టుకుని వారు సంస్థ‌ను విజ‌య‌ప‌థంలో నిలుపుతూ ఉన్నారు. ఈ త‌రంలో కూడా ఎల్ఐసీ గ‌ట్టి న‌మ్మ‌క‌మే ఉంది. ప్రైవేట్ వాళ్లు ఎన్నో ర‌కాల‌ ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉన్నా.. ఎల్ఐసీ ని దెబ్బ‌తీయ‌లేక‌పోతూ ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో ఈ జీవ‌న‌ బీమా సంస్థ‌ను ప్రైవేటీ క‌రించ‌డానికి మోడీ ప్ర‌భుత్వం రెడీ అయ్యింది. ఇప్ప‌టికే ప‌లు ప్రభుత్వ రంగ సంస్థ‌ల్లో వాటాను అమ్ముకుంటూ వ‌స్తోంది మోడీ ప్ర‌భుత్వం. వీళ్లు గ‌ద్దె న‌క్కాకా డిజెన్వెస్ట్ మెంట్ రూపంలో న‌వ‌ర‌త్న కంపెన‌ల్లో వాటాలు అమ్మారు. ఎయిరిండియాతో పాటు వివిధ వ్య‌వ‌స్థ‌ల ప్రైవేటీక‌ర‌ణ‌కు మోడీ ప్ర‌భుత్వం మొగ్గు చూపింది. న‌ష్టాల్లో ఉన్న సంస్థ‌ల‌నూ ప్రైవేటీక‌రించి, లాభాల్లో ఉన్న సంస్థ‌ల‌నూ ప్రైవేటీక‌రించ‌డంపై  విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఎల్ఐసీ ప్రైవేటీక‌ర‌ణ‌ను ఆ సంస్థ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి.
Tags:    

Similar News