వైసీపీది వికేంద్రీకరణ విధానం. ఈ విషయంలో దాచడానికి ఏమీ లేదు. వైసీపీ అధికారంలోకి వస్తూనే ఈ విషయం స్పష్టం చేసింది. ఎవరూ ఎక్కడా ఊహించని విధంగా గ్రామ వార్డులలో సచివాలయాలను ఏర్పాటు చేసింది. దాని ద్వారా ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్ళింది. అది అలా ఉండగానే కొత్తగా మండలాలు ఏర్పాటు చేసింది. ఏకంగా చంద్రబాబు సొంత సీటు కుప్పాన్ని రెవిన్యూ డివిజన్ గా జగన్ చేశారు. అనేక ఇతర రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు.
ఏపీలో పదమూడు జిల్లాలు ఉంటే వాటిని ఇరవై ఆరు జిల్లాలుగా చేశారు. ఇపుడు మూడు రాజధానులు అంటున్నారు. ఈ విషయంలో జనాల మైండ్ సెట్ మెల్లగా మార్చడానికి వైసీపీ ప్రయత్నం చేస్తూనే ఉంది. అమరావతి రాజధానిని తాము ఏమాత్రం ఇబ్బందిపట్టమని, అక్కడ శాసన రాజధాని కొనసాగుతుందని, అదే విధంగా విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూల్ లో న్యాయ రాజధాని ఉంటుందని చెప్పుకొస్తోంది.
దీనికి మద్దతుగా అక్టోబర్ 15న విశాఖలో రాజధాని గర్జన పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమాన్న్ని వైసీపీ నిర్వహించింది. దానికి మంచి స్పందన లభించింది. ఇపుడు అదే తరహాలో కర్నూల్ లో న్యాయ రాజధాని కోరుతూ గర్జన కార్యక్రం నిర్వహించింది. శ్రీ భాగ్ ఒప్పందం 1936న జరిగింది. అప్పట్లో మద్రాస్ స్టేట్ నుంచి ఆంధ్రా ప్రాంతం విడిపోవడానికి కోస్తా జిల్లాల వారు అంగీకరించినా సీమ వారు వ్యతిరేకించారు.
తమకు ఏపీలో ప్రత్యేక ప్రయోజనాలు ఏమి ఉంటాయని వారు ప్రశ్నించారు. అయితే వారికి సమాధానంగా రాజధాని అయినా హై కోర్టు అయినా రాయలసీమలో పెడతామని శ్రీభాగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ విధంగా మూడేళ్ళ పాటు కర్నూ లో ఆంధ్రా రాజధాని సాగింది. తరువాత ఉమ్మడి ఏపీ ఏర్పడింది. తిరిగి 2014లో విభజన ఏపీగా మారినా శ్రీభాగ్ ఒప్పందం మాత్రం అమలు చేయలేదు. ఇపుడు వైసీపీ నేతలు అదే విషయం గుర్తు చేస్తూ తమకు హై కోర్టు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆ విధంగా వారిలో రాజధాని కోరిక రగిలించేలా వైసీపీ జేయేసీల ద్వరా కధ నడుతోంది. ఇక ఉత్తరాంధ్రా వెనకబడిన ప్రాంతమని ఆ ప్రాంతానికి రాజధాని ఆశలు ఉండవా అని చెప్పి వారిలో ఆలోచనలు కొత్తగా పెడుతోంది. ఇక టీడీపీ మద్దతుతో అమరావతి రైతులు ఉద్యమాలు చేశారు. న్యాయాలయం టూ దేవాలయం అని పాదయాత్రలు చేసారు. అమరావతి నుంచి అరసవెల్లి అంటూ రెండవ విడత పాదాయాత్ర స్టార్ట్ చేసి మధ్యలో వదిలేశారు. మరి పాదయాత్ర చేస్తారో లేదో తెలియదు.
ఒక విధంగా మూడు రాజధానుల విషయంలో టీడీపీ ఫుల్ సైలెంట్ అయినట్లుగా ఉంది. సుప్రీం కోర్టు మధ్యంతర తీర్పు తరువాత ఎందుకో టీడీపీ వ్యూహంలో మార్పు కనిపిస్తోంది. పైగా మూడు రాజధానుల విషయంలో గట్టిగా వ్యతిరేకంగా మాట్లాడకూడదు అన్నట్లుగా ఆ పార్టీ ఆలోచిస్తోందా అన్న చర్చ కూడా ఉంది. అయితే టీడీపీ ఇలా సైలెంట్ గా ఉన్న టైం నే అడ్వాంటేజ్ గా తీసుకుని వైసీపీ గర్జనలు చేస్తూ వస్తోంది.
వచ్చే ఎన్నికల్లో వికేంద్రీకరణనే మంత్రంగా చేసుకుని ముందుకు సాగాలని చూస్తోంది. ఈ మధ్య చంద్రబాబు కర్నూల్ టూర్ కి వెళ్ళినపుడు అక్కడ న్యాయవాదులు హై కోర్టు గురించి ప్రస్తావించారు. రేపటి రోజున ఆయన విశాఖ వచ్చినా రాజధాని మీద రచ్చ చేయాలని వైసీపీ ప్లాన్ వేసుకుంటోంది. అమరావతికే టీడీపీ కట్టుబడి ఉంటే మిగిలిన రెండు ప్రాంతాలు దాదాపు మ్యాజికి ఫిగర్ సరిపడా ఉన్న అసెంబ్లీ సీట్ల మీద కన్నేసి వైసీపీ తనదైన పాలిటిక్స్ ని చేస్తోంది అంటున్నారు.
ఒక విధంగా టీడీపీని కార్నర్ చేయాలని చూస్తోంది. ఈ పరిస్థితులలో టీడీపీ మాట్లాడినా తప్పు అవుతుంది, సైలెంట్ గా ఉన్న దెబ్బ అవుతుంది అన్న సీన్ ని వైసీపీ క్రియేట్ చేసింది అంటున్నారు. సుప్రీం కోర్టు లో ప్రస్తుతం అమరావతి రాజధాని మీద విచారణ సాగుతోంది. ఈ తీర్పు వచ్చిన తరువాత మూడు రాజధానుల మీద ముందుకు వెళ్లాలని, తాను అనుకున్నట్లుగా అధికార వికేంద్రీకరణే ఏపీకి శరణ్యం అని చెప్పాలని వైసీపీ చూస్తోంది.
లక్షల కోట్లు ఒకే చోట పెట్టి అమరావతిని డెవలప్ చేస్తే మళ్ళీ విభజన ఉద్యమాలు వస్తాయని చెప్పే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. దానికి ఏపీ ప్రస్తుత ఆర్ధిక పరిస్థితి కూడా సహకరించదు అని కూడా గట్టిగా చెబుతోంది. మరి జనాల్లోకి ఈ ఆలోచనలు వెళ్తే వైసీపీ మార్క్ పాలిటిక్స్ సక్సెస్ అయినట్లే. ఏది ఏమైనా టీడీపీని సైలెంట్ మోడ్ లో ఉంచడం తమ గొప్పదనంగా ఇప్పటికైతే వైసీపీ భావిస్తోంది అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.