సోషల్ మీడియా.. ఎవర్నైనా రాత్రికి రాత్రే ఫేమస్ చేయగలదు. అంతే వేగంగా పాతాళంలోకి నెట్టేయగలదు. విచ్చలవిడి తనం తో విశృంఖలత్వం వల్ల ఇటీవల సోషల్ మీడియా ద్వారా చాలా మంది నేరాలకు పాల్పడుతున్నారు. ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు మాత్రం సామాజిక మాధ్యమాల్లో కనిపించే కొన్ని ఫోటోలు, వీడియోలు, కొన్ని స్టోరీలు మాత్రం మనసుని తాకుతాయి. అలాంటి ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ఈ ఫొటోను నెటిజన్లు మరింత లైక్ చేస్తున్నారు.
తండ్రి వారసత్వాన్ని కొడుకు పుణికి పుచ్చు కోవడం పరిపాటే. తండ్రి నడిచిన బాటలోనే కుమారుడు నడవడం సాధారణమే. తండ్రి క్రికెటర్ అయితే కొడుకు క్రికెటర్ అవ్వడం.. తండ్రి బిజినెస్‌ను కుమారుడు టేకోవర్ చేసి ముందుకు తీసుకెళ్లడం సర్వసాధారణం. అలాగే తండ్రి పనిచేస్తున్న రైల్వేలోనే తాను ఉద్యోగం సంపాదించాడు ఓ కొడుకు.
అలా ఓ రోజు విధుల్లో ఉన్న తండ్రీ కుమారుడు ప్రయాణిస్తున్న రైలు పక్కపక్కనే నిలిచాయి. అప్పుడు రైల్లో నుంచి బయటకు వచ్చిన తండ్రిని చూసిన కుమారుడు జేబులో నుంచి ఫోన్ తీసి పప్పా.. సెల్ఫీ ప్లీజ్ అంటూ ఓ ఫొటో తీశాడు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ ఆదివారం వరల్డ్ ఫాదర్స్ డే వస్తోన్న సందర్భంగా ఈ ఫొటోకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఫొటోను నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు. లైక్ ఫాదర్.. లైక్ సన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
కొందరు అద్భుతమైన ఫొటో అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటోను సురేశ్ అనే ఓ వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసి అద్భుతమైన సెల్ఫీ అనే క్యాప్షన్ ఇచ్చాడు. దీనిపై తండ్రీ కొడుకుల ప్రేమ అంటూ నెటిజన్లు తమదైన స్టైల్లో ప్రేమను చూపిస్తున్నారు.
ఇద్దరు తండ్రీ కుమారులు. తండ్రి రైల్వేలో గార్డుగా పని చేస్తున్నారు. కుమారుడేమో ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజూ వివిధ ప్రాంతాల్లో.. వివిధ సమయాల్లో విధులు నిర్వహించే వీరు.. ఇటీవల అనుకోకుండా ఒకే దగ్గర కలుసుకున్నారు.
అదేలా అంటే.. గార్డుగా తండ్రి విధులు నిర్వహిస్తున్న రైలు.. టీటీగా కొడుకు పనిచేస్తున్న రైలు ఒకే ప్లాట్‌ఫాం పైన పక్కపక్కనే ఉన్న రైల్వే ట్రాక్‌లపై ఆగాయి. ఆ సమయంలో రైలు నుంచి బయటకు చూస్తున్న తండ్రిని అప్పుడే రైలు తలుపు వద్దకు వచ్చిన కుమారుడు చూశాడు. వెంటనే పప్పా ఓ సెల్ఫీ అంటూ.. కొడుకు ఫొటో తీశాడు. ఈ ఫొటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.