పెన్ష‌న్...ఇప్పుడు భార్య లేని వారికి కూడా!

Update: 2017-03-07 06:02 GMT
సంక్షేమ ప‌థ‌కాల అమ‌ల్లో భాగంగా వృద్ధాప్యంలో ఉన్న వారికి, భ‌ర్త చ‌నిపోయిన‌ మ‌హిళ‌ల‌కు జీవ‌న భృతి కింద పెన్ష‌న్ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ ప్ర‌భుత్వం ఇటీవ‌ల ఓ అడుగు ముందుకు వేసి ఒంటరి స్త్రీల‌కు కూడా ఇవ్వ‌నున్నట్లు ప్ర‌క‌టించింది. అయితే స‌ద‌రు ఆర్థిక భ‌రోసాను కేవ‌లం  మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే ఎందుకు ఇవ్వాలి? పురుషుల‌కు సైతం ఇవ్వ‌చ్చు క‌దా అనే ఆలోచ‌న వ‌చ్చిన‌ట్లుంది. అందుకే హర్యానా ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని అమలుచేసేందుకు సిద్ధం అవుతోంది. భార్య ను కోల్పోయిన మగవారికి పెన్షన్ ఇచ్చేందుకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది.

హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు వితంతు పెన్షన్ ఇచ్చేవారు. ఇక నుంచి జీవిత భాగస్వామిని కోల్పోయిన మగవారికి కూడా పెన్షన్ ఇచ్చే ఆలోచన చేస్తున్నాం అని ప్రకటించారు. ఈ మేరకు దీని సాధ్యా సాధ్యాలను పరిశీలిస్తున్నామని, దీన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేసేందుకు యోచిస్తున్నామని సీఎం తెలిపారు. హర్యానా అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే రవీందర్ మచ్‌ రోలీ భార్యను కోల్పోయిన మగవారికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ జోక్యం చేసుకుని ఈ అంశాన్ని పరిశీలిస్తామని ప్రకటించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News