వరుసబెట్టి బీజేపీ నుంచి టీఆర్ఎస్ లోకి.. కేసీఆర్ స్కెచ్ మామూలుగా లేదుగా?
ఢిల్లీకి వెళ్లి 10 రోజుల పాటు ఏం చేశాడో తెలియదు కానీ.. హైదరాబాద్ రాగానే తెలంగాణ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేస్తున్నారు కేసీఆర్. తన పాత తప్పులన్నీ సరిదిద్దుకుంటున్నారు. టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన ఉద్యమకారులందరినీ తిరిగి తనే స్వయంగా ఫోన్లు చేసి మరీ రప్పించి వారి రాజకీయ భవిష్యత్ పై హామీలిస్తున్నారు. దీంతో వరుసబెట్టి బీజేపీలోకి వెళ్లిన నేతలంతా తిరిగి టీఆర్ఎస్ లో చేరుతున్నారు.
కొద్దిసేపటి క్రితమే బీజేపీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ సాయంత్రం కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక ఆయన బీజేపీ విధానాలను.. మునుగోడులో డబ్బులు వెదజల్లుతున్న బీజేపీ తీరును.. నాయకత్వ లోపంతో బండి సంజయ్ విధానాలను ప్రశ్నిస్తూ రాజీనామా లేఖలో సంచలన బాంబులు బీజేపీపై వేశాడు.
ఇక దాసోజు శ్రవణ్ రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే మరో సీనియర్ నేత స్వామిగౌడ్ సైతం బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఆయన కూడా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడికి లేఖ పంపారు. కాసేపట్లోనే కేటీఆర్ సమక్షంలో స్వామిగౌడ్ కారెక్కనున్నారు.
ఒకే రోజు ఇద్దరు టీఆర్ఎస్ లో చేరడం వెనుక కేసీఆర్ మాస్టర్ మైండ్ ఉన్నట్టు తెలిసింది. ఈ ఉదయం నుంచి టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్, జితేందర్ రెడ్డి లాంటి వారికి కేసీఆర్ స్వయంగా ఫోన్లు చేసి కలిసి తిరిగి పనిచేద్దాం అని పిలుపునిచ్చినట్టు తెలిసింది.
దీంతో వారందరూ మనసు మార్చుకొని తిరిగి టీఆర్ఎస్ లో చేరేందుకు ఓకే అన్నారు. ప్రగతి భవన్ వచ్చి మరీ టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పటికే దాసోజు శ్రవణ్ చేరిపోగా.. స్వామిగౌడ్ చేరడానికి రెడీ అయ్యారు. జితేందర్ రెడ్డిది క్లారిటీ రావాల్సి ఉంది.
బీజేపీని ఓడించాలంటే మంచి బలమైన నేతలు.. బలమైన వాయిస్ ఉన్న వ్యక్తుల అవసరం టీఆర్ఎస్ కు ఉంది. అందుకే కేసీఆర్ తిరిగి ఉద్యమకారులకే పట్టం కట్టాలని నిర్ణయించారు. అందుకే బీజేపీలో చేరిన ఉద్యమకారులకు ఫోన్లు చేసి మరీ తిరిగి కారెక్కిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ ఈ పరిణామం బీజేపీకి గట్టి షాక్ లా మారగా.. కేసీఆర్ వ్యూహాలకు టీఆర్ఎస్ లో జోష్ నెలకొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.