నవ్యాంధ్ర రాజధానికి వెళ్లాలనుకునే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వసతి సమస్య దాదాపు పరిష్కారమైనట్లే. రాజధాని ప్రాంతంలోనే వారికి పెద్ద ఎత్తున వసతి లభించనుంది. ఇందుకు లింగమనేని రియల్ ఎస్టేట్స్ ముందుకు రావడమే కారణం.
నవ్యాంధ్ర రాజధాని నడిబొడ్డున, నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా, జాతీయ రహదారికి అనుకుని లింగమనేని ఎస్టేట్స్ ఉంది. భారీ విస్తీర్ణంలో విస్తరించిన లింగమనేనిలో పెద్ద ఎత్తున అపార్టుమెంట్లు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి పెద్దగా గిరాకీ లేకపోవడంతో వీటికి కూడా డిమాండ్ లేకపోయింది. ఇప్పుడు ఈ ప్రాంతం రాజధాని కావడంతో ఈ అపార్టుమెంట్లకు మహర్దశ పట్టింది. ఈ నేపథ్యంలోనే లింగమనేని ఎస్టేట్స్ ప్రతినిధులు మరో ఆలోచన చేశారు. తమ అపార్టుమెంట్లలోని 500 ఫ్లాట్లను ప్రభుత్వానికి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతి లాల్ దండేను కలిశారు. ఉద్యోగులకు తాత్కాలిక వసతి కింద 500 ఫ్లాట్లు ఇస్తామని ప్రతిపాదించారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్నందున రవాణాకు కూడా ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులను నిజంగా రాజధాని ప్రాంతానికి తరలించాలని అనుకుంటే ఇది మంచి ప్రతిపాదన అని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను ఇక్కడికి తరలించినా.. లేక ప్రభుత్వ కార్యాలయాలనే ఇక్కడ ఏర్పాటు చేసినా అందరికీ అనువుగా ఉంటుందని కూడా చెబుతున్నారు.