అమెరికాలో ఆ ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్

Update: 2017-02-07 12:46 GMT
అమెరికా అంటే ప్రపంచదేశాల ఉద్యోగులు, విద్యార్థులకు కలలతీరం. అక్కడ ఉద్యోగం చేయాలని, డాలర్ల మూటలతో ఇండియాకు రావాలని కలలు కంటుంటారు. అయితే, అక్కడ అన్ని సంస్థలు, అన్ని ఉద్యోగాలు ఒకే స్థాయిలో ఉండవు. కొన్ని అనుకూలతలు, ప్రతికూలతలు ఉంటాయి. ఉద్యోగ భద్రత, ఉద్యోగోన్నతి అంతటా ఒకేలా ఉండదు. ఈ నేపథ్యంలో అమెరికాలో మంచి సంపాదనతో పాటు, భద్రతను, కెరీర్ గ్రోత్ ఉన్న  ఉద్యోగాల జాబితాను ప్రముఖ నెట్ వర్కింగ్ సైట్ లింకెడ్ ఇన్ ప్రకటించింది.

లింక్డ్ ఇన్ జాబితాలో టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలు ముందు నిలిచాయి. ఇదే సమయంలో హెల్త్ కేర్ - ఆతిథ్య - ఫార్మా రంగాలూ మెరుగైన ఉద్యోగాలను అందిస్తున్నాయని వెల్లడైంది. లింక్డ్ ఇన్ వెల్లడించిన 'మోస్ట్ ప్రామిసింగ్ జాబ్స్ ఇన్ యూఎస్ ఫర్ 2017' లో ఏమేం ఉన్నాయో చూద్దాం. హెల్త్ కేర్ సెక్టార్ టాప్ లో ఉన్నప్పటికీ టాప్ లిస్టులో ఎక్కువగా టెక్ ఉద్యోగాలే ఉండడం విశేషం. కాగా, ఈ ఉద్యోగాలకు ఇప్పటికే అక్కడ మంచి డిమాండు ఉంది.

రంగం: హెల్త్ కేర్
సగటు మూల వేతనం: 2,22,000 డాలర్లు
గత సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగాల వృద్ధి: 1000 (87 శాతం)
కెరీర్ అడ్వాన్స్ మెంట్ స్కోరు: 6.0
ఉండాల్సిన నైపుణ్యాలు: హెల్త్ కేర్ మేనేజ్ మెంట్, ఇన్ పేషంట్ కేర్, ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్, రోగుల భద్రత, ఇంటర్నల్ మెడిసిన్స్.

జాబ్: సైట్ రిలయబిలిటీ ఇంజనీర్
సగటు బేసిక్ వేతనం: 1,41,000 డాలర్లు
గత సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగాల వృద్ధి: 300 (97 శాతం)
కెరీర్ అడ్వాన్స్ మెంట్ స్కోరు: 8.0
ఉండాల్సిన నైపుణ్యాలు: లైనెక్స్, పైథాన్, బాష్, అపాచీ, షెల్ స్క్రిప్టింగ్.

జాబ్: టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్
సగటు బేసిక్ వేతనం: 1,29,000 డాలర్లు
గత సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగాల వృద్ధి: 500 (49 శాతం)
కెరీర్ అడ్వాన్స్ మెంట్ స్కోరు: 7.0
ఉండాల్సిన నైపుణ్యాలు: ఏజిల్ మెథడాలజిక్స్, సాఫ్ట్ వేర్ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్, సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ లైఫ్ సైకిల్, క్లౌడ్ కంప్యూటింగ్.

రంగం: ఫార్మా
సగటు బేసిక్ వేతనం: 1,23,000 డాలర్లు
గత సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగాల వృద్ధి: 3300 (45 శాతం)
కెరీర్ అడ్వాన్స్ మెంట్ స్కోరు: 5.0
ఉండాల్సిన నైపుణ్యాలు: మెడికేషన్ థెరపీ మేనేజ్ మెంట్, కమ్యూనిటీ ఫార్మసీ, పేషంట్ కౌన్సిలింగ్, ఫార్మసీ ఆటోమేషన్.

జాబ్: డేటా ఇంజనీర్
సగటు బేసిక్ వేతనం: 1,05,000 డాలర్లు
గత సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగాల వృద్ధి: 900 (85 శాతం)
కెరీర్ అడ్వాన్స్ మెంట్ స్కోరు: 8.0
ఉండాల్సిన నైపుణ్యాలు: హదూప్, పైథాన్, ఎస్క్యూఎల్, బిగ్ డేటా, హైవ్.

రంగం: సేల్స్ ఇంజనీర్
సగటు బేసిక్ వేతనం: 80,000 డాలర్లు
గత సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగాల వృద్ధి: 3000 (159 శాతం)
కెరీర్ అడ్వాన్స్ మెంట్ స్కోరు: 6.0
ఉండాల్సిన నైపుణ్యాలు: సొల్యూషన్ సెల్లింగ్, సేల్స్ మేనేజ్ మెంట్, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ం ఆటోమేషన్, సేల్స్ ఇంజనీరింగ్.

జాబ్: ప్రొడక్ట్ మేనేజర్
సగటు బేసిక్ వేతనం: 97,000 డాలర్లు
గత సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగాల వృద్ధి: 3000 (11 శాతం)
కెరీర్ అడ్వాన్స్ మెంట్ స్కోరు: 8.0
ఉండాల్సిన నైపుణ్యాలు: ప్రొడక్ట్ డెవలప్ మెంట్, కాంపిటేటివ్ అనాలిసిస్, ప్రొడక్ట్ లాంచ్, క్రాస్ ఫంక్షనల్ టీమ్ లీడర్ షిప్, మార్కెటింగ్ స్ట్రాటజీ.

వీటితో పాటు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు (94 వేల డాలర్లు),  డాటా ఆర్కిటెక్ట్ (1,22,000 డాలర్లు), అనస్థటిస్ట్ (1,56,000 డాలర్లు), అనలిటిక్స్ మేనేజర్ (1,09,000 డాలర్లు)  తదితర టెక్ ఉద్యోగాలు మంచి కెరీర్ లుగా నిలుస్తున్నాయని ఆ రిపోర్టులో తేలింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News