ఫుట్ బాల్ ప్రపంచ కప్ ముగిసింది.. ఎక్కువమంది కోరుకున్నట్లు అర్జెంటీనా గెలిచింది.. ఇక మిగిలింది 35 ఏళ్ల లయోనల్ మెస్సీ రిటైర్మంట్ గురించి చర్చనే. వాస్తవానికి ఈ ప్రపంచ కప్ ప్రారంభం నుంచి అంతటా ఒకటే మాట.. మెస్సీ కలను నిజం చేస్తూ అర్జెంటీనాను కప్ కొడుతుందా..? సగర్వంగా ప్రపంచ కప్ ను అందుకున్నాక మెస్సీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అని. దీనికితోడు మూడు నెలల కిందట మెస్సీ స్వయంగా చెప్పాడు తన రిటైర్మెంట్ గురించి. ప్రపంచ కప్ తనకు ఆఖరు అని. ఈ టోర్నీ జరుగుతున్న సందర్భంలోనూ అతడు రిటైర్మెంట్ గురించి చూచూయగా మాట్లాడాడు. ఇక కప్ ముగిసింది.. అంతా నిజమైంది.. ఇక మెస్సీ రిటైర్మెంటే మిగిలింది. కానీ.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ మెస్సీ ప్రకటన చేశాడు.
ఇప్పుడప్పుడే కాదు..
మెస్సీ వయసు 35 ఏళ్లు. ఈ ప్రపంచ కప్ లో అతడి జోరు చూశాక ఎవరూ అతడికి రిటైర్మెంట్ వయసొచ్చిందని భావించరు. అంతలా చెలరేగాడీ వెటరన్. యువకులతో సమానంగా పరిగెడుతూ మ్యాచ్ ల ఫలితాన్ని ఒంటికాలితో మార్చేశాడు. అంతెందుకు..? ఫైనల్లో మెస్సీ విన్యాసాలు అన్నీఇన్నీ కావు. చివరకు మూడో గోల్ మెస్సీ సాహసంతోనే నమోదైంది. అదలా ఉంచితే కప్ ను అందుకున్న మరుక్షణం అతడు దానిని అపురూపంగా చూసిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. కాగా, ఈ క్షణమే మెస్సీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ ఊహించారు. కానీ, విజయోత్సవంలో అతడు ఏమీ మాట్లాడలేదు.
ఏమని చెప్పాడంటే..
ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించడంలేదని ఫైనల్ తర్వాత మెస్సీ స్వయంగా వెల్లడించాడు. ''కెరీర్‌ను దీంతో ముగిద్దామని అనుకొన్నాను. ఇప్పటిదాకా అందనిది ఇదే. ఇకపై నేను ఏమీ అడగను. కోపా సాధించగలిగాను. ఇప్పుడు ప్రపంచకప్ ను కెరీర్ చరమాంకంలో సాధించాను. నేను ఫుట్‌బాల్‌ను ప్రేమిస్తాను. ప్రపంచ ఛాంపియన్‌గా మరికొన్ని గేమ్స్ ఆడాలనుకుంటున్నాను'' అని మెస్సి స్పష్టం చేశాడు. 'ప్రపంచ ఛాంపియన్ కావాలని చాలా సార్లు కలలుగన్నాను. సాధించలేకపోయాను.
కానీ, ఇప్పుడు దీన్ని నమ్మలేకపోతున్నా. మమ్మల్ని నమ్మిన వారికి, నాకు మద్దుతు ఇచ్చినవారికి, నా కుటుంబానికి ధన్యవాదాలు. అర్జెంటీనా సమష్టిగా పోరాడితే అనుకొన్న లక్ష్యాన్ని సాధించగలదని మరోసారి నిరూపించాము. వ్యక్తుల కంటే ఎక్కువగా ఈ ఘనత జట్టుకే చెందుతుంది. అర్జెంటీనా వాసుల కల కోసం సమష్టిగా పోరాడటంలో ఉన్న బలం ఇది'' అంటూ ఇన్ స్టాలో షేర్ చేశాడు. కనీసం మరో రెండేళ్లు మెస్సీ ఉద్దేశం బట్టి చూస్తే కనీసం మరో రెండేళ్లు అతడు ఫుట్ బాల్ లో కొనసాగే అవకాశం ఉంది.
ఈ వ్యవధిలో ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా హోదాను ఆస్వాదిస్తూ భవిష్యత్ ప్రణాళికలు రచించే వీలుంది. ఎందుకంటే.. ప్రస్తుత అర్జెంటీనా కుర్రాళ్లతో కూడినది. ఇన్నాళ్లూ మెస్సీపైనే అంతా నడిచింది. ఇప్పుడతడు ఉన్నట్లుండి రిటైరైతే సాధారణ జట్టులా మిగిలిపోతుంది. అందుకని మరో రెండేళ్లయినా జట్టుతో కొనసాగే అవకాశం ఉంది. అందులోనూ వచ్చే ప్రపంచ కప్ జరగబోయేది అర్జెంటీనాకు దగ్గర్లోని అమెరికాలో. ఆ కప్ నకు కెనడా, మెక్సికో సైతం ఆతిథ్యం ఇస్తున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ గా అర్జెంటీనా బరిలో దిగే అవకాశం ఉంది. అల్వారెజ్ వంటి కుర్రాళ్లకు మార్గనిర్దేశం చేస్తూ అర్జెంటీనాను మరింత బలీయంగా నిలిపేందుకు మెస్సీ మరికొన్నేళ్లు ఆడే అవకాశం ఉంది.
2026 ప్రపంచ కప్ లోనూ ఆడతాడా?
మెస్సీ వయసు 35. వచ్చే ప్రపంచ కప్ నాటికి అతడికి 39 ఏళ్లు వస్తాయి. ఫిట్ నెస్ ప్రధానంగా సాగే ఫుట్ బాల్ లో ఇది చాలా పెద్ద వయసు. దీంతో వచ్చే కప్ నాటికి మెస్సీ కొనసాగే అవకాశాలు తక్కువే. కానీ.. పూర్తిగా మాత్రం కొట్టిపారేయలేం. ఏమో.. ప్రధాన మ్యాచ్ లను అతడిని బరిలో దింపి తురుపుముక్కగా వాడుకునే అవకాశం లేకపోలేదు. ఈ కప్ లో చాలామంది కుర్రాళ్ల కంటే మెస్సీ ఎంతో చురుగ్గా కదిలాడు. ఈ ఫిట్ నెస్ ను కాపాడుతకుంటూ వచ్చే కప్ లో బరిలో దిగినా ఆశ్చర్యం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.