దసరాకి ఏ రేంజ్ లో తాగారంటే...

Update: 2016-10-13 04:56 GMT
ఒకవైపు దసరా సంబురాలు అంబరాన్నంటగా - మరోవైపు ఆ సంబురాల్లో భాగంగా మద్యం అమ్మకాలు చుక్కలను తాకాయి. అవి ఏ రేంజ్ లో సాగాయంటే... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆది - సోమ - మంగళ - బుధవారాల్లో ఏకంగా రూ.106 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. దసరా సందర్భంగా ఆ నాలుగు రోజులూ వరుసగా సెలవులు రావడంతో హైదరాబాద్ మహానగరం పరిధిలోని ఉన్న సుమారు 590 బార్లు - మరో 400 వరకు ఉన్న మద్యం దుకాణాలు కిటకిటలాడి ఈ రికార్డు సృష్టించాయట. ఈ అమ్మకాల్లో యువత ఎక్కువగా కొనుగోలు చేసే బీర్లే ఎక్కువగా అమ్ముడయ్యాయని - మొత్తంగా గతేడాది దసరాతో పోలిస్తే ఈ సారి సుమారు 13 శాతం అధికంగా మద్యం అమ్మకాలు జ్రైగాయని ఆబ్కారీశాఖ చెబుతోంది.

దసరా సంబరాల్లో భాగంగా ఆ నాలుగురు రోజులూ వరుసగా సెలవులు రావడంతో సగటున రోజుకు రూ.33 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయట. సాధారణంగా హైదరాబాద్‌ లో రోజూ సగటున రూ.10 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతాయి. అయితే దసరా పండుగ కావడం - వరుసగా సెలవులు రావడంతో ఈ అమ్మకాలు మూడున్నర రెట్లు అధికంగా జరిగాయి. ఇదేసమయంలో పండుగ వేడుకల కోసం సొంత ఊళ్లకు బయలుదేరిన వారు సైతం నగరం నలుమూలల్లో ఉన్న మద్యం దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసుకుని వెళ్లడం కూడా దీనికి కారణం కాగా, మరో పక్క బార్లలో రెండు పెగ్గులు ఆర్డర్ చేస్తే మూడో పెగ్గు ఉచితం అన్న ఆఫర్లతోనూ ఎక్కువ మద్యం వినియోగమైనట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా... దసరా పేరుచెప్పి మందుబాబులు ఈ రేంజ్ లో పండగ చేసుకున్నారన్నమాట!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News