తన కారులో మద్యాన్ని సరఫరా చేస్తున్న ఎమ్మెల్యే ... కేసు నమోదు !

Update: 2020-05-14 07:30 GMT
ఈ మధ్య కాలంలో ప్రజాప్రతినిధుల కంటే ప్రజలే బాధ్యతాయుతంగా నడుచుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులు నలుగురికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి వారే అడ్డదారులు తొక్కుతున్నారు. అందరూ అలానే ఉన్నారు అని చెప్పడంలేదు కానీ, కొంతమంది మాత్రం తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేయకూడని పనులని కూడా చేస్తున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యే  తన కారులో మద్యం బాటిల్స్ ను సరఫరా చేస్తూ  పోలీసులకి దొరికారు. ఈ మహమ్మారి కారణంగా లాక్ డౌన్ ను విధించడంతో మందు షాప్స్ ను దాదాపుగా 40 రోజులు మూసేసారు. లాక్ డౌన్ నుండి కొన్ని సడలింపులు ఇచ్చి గత వారం  మద్యం దుకాణాలను తెరచారు.

ఈ నేపథ్యంలో ఓ వైపు లాక్ డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో బ‌క్స‌ర్ ఎమ్మెల్యే సంజ‌య్ కేఆర్ తివారి తన కారులో అక్రమంగా మద్యాన్ని తరలిస్తూ  పోలీసులకి పట్టుబడ్డారు. బుధవారం రాత్రి సమయంలో పోలీసు తనిఖీ నిర్వహిస్తుండగా బక్సార్‌ ఎమ్మెల్యే సంజయ్‌ తివారి కారులో మద్యం బాటిల్స్‌ లభించాయి. దీనిపై పోలీసులు ప్రశ్నించగా అతను పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్‌ చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన మద్యం సరఫరా చేస్తున్నందుకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

దీనితో ఎమ్మెల్యే సంజయ్‌ మాట్లాడుతూ.. లాక్‌ డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదవారికి తాను సహాయం చేస్తున్నా అన్నారు. బియ్యం, నిత్యవసర సరుకులు, కూరగాయాలు గత నెల నుంచి పేదలకు పంచుతున్నానని తెలిపారు. అయితే మద్యం బాటిల్స్‌ తన వాహనంలోకి  ఎలా వచ్చాయో తనకు తెలీదని సజయ్‌ చెప్పారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
Tags:    

Similar News