హుజురాబాద్‌ లో రికార్డు మద్యం అమ్మకాలు

Update: 2021-10-30 05:11 GMT
నూతన సంవత్సర వేడుకలను( జనవరి ఫస్ట్) అన్ని వర్గాలు భేదా బ్రియాలు లేకుండా జరుపు కునే వేడుక. డిసెంబర్ 31 రోజు రాత్రి నుంచి తెగ ఎంజాయ్ చేస్తారు. మందు, విందు, చిందు కామన్. జనవరి రెండో తేదిన మద్యం ప్రియులు కోట్ల ల్లో మద్యాన్ని తాగే శారని దిన పత్రిక ల్లో పతాక శీర్షిక ల్లో వార్తలు వస్తుంటాయి. దీన్ని చూసిన పాఠకులు ఆశ్యర్యానికి గురవుతుంటారు. ఇంత తాగారా? అని నోరెళ్ల బెడుతుంటారు. రాష్ట్ర వ్యాప్తం గా ఒకటి, రెండు కోట్ల రూపాలయల మద్యం విక్రయాలు జరిగితే ఆశ్చర్య పోతుంటారు. ఇప్పుడు హుజురాబాద్ నియోజవర్గం లో గురు, శుక్రవారం ఈ రెండు రోజు ల్లో రెండు కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయని చెబుతున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెల ల్లో హుజురాబాద్‌ లో 48 కోట్ల 2 లక్షల 28 వేల రూపాయల మద్యం అమ్మినట్లు రికార్డులు చెబుతున్నాయి.

హుజరాబాద్‌ లో ఓటర్ల ను ప్రలోబాలకు గురి చేసేందుకు డబ్బుతో పాటు మద్యాన్ని విచ్చల విడి గా పంపిణీ చేశారు. రెండు నెలలు గా హుజురాబాద్‌ లో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లు గా ప్రచారం చేశారు. పోటా పోటీ ప్రచారం తో పాటు మద్యం, మాంసం, విందులకు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మద్యాన్ని పంపిణీ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ లను ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికలు తేదీ సమీపిస్తున్న రోజు ల్లో ప్రతి రోజు దాదాపు గా రెండు కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. గురు, శుక్ర వారా ల్లో నియోజక వర్గంలో భారీ గా మద్యం పంపిణీ జరిగి నట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం పొంతన లేని సమాధానం చెబుతున్నారు. గతేడాది మాదిరి గానే మద్యం అమ్మకాలు జరిగినట్లు రికార్డులు చూపెడుతున్నారు.

హుజురాబాద్‌ లో ఖర్చు చేసిన మద్యాన్ని వివిధ జిల్లాల నుంచి సేకరించినట్లు తెలుస్తోంది. ఎవరీ కంట పడ కుండా డంప్ చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ నెల లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో 76 కోట్ల 19 లక్షల 22 వేల రూపాయల మద్యం అమ్మ కాలు జరిగాయి. హుజురాబాద్‌ లో పరిధిలో 11 కోట్ల 3 లక్షల 64 వేల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. జమ్మికుంట లో 12 కోట్ల 24 లక్షల 64 వేల రూపాయల వ్యాపారం జరిగింది. ఇక అక్టోబర్ నెలలో జిల్లాలో 84 కోట్ల 64 లక్షల రూపాయల మద్యాన్ని అమ్మారు. ఉప ఎన్నిక జరుగుతున్న హుజురాబాద్‌ లో 11 కోట్ల 53 లక్షలు, జమ్మికుంట లో 13 కోట్ల 21 లక్షల రూపాయల వ్యాపారం జరిగింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 48 కోట్ల 2 లక్షల 28 వేల రూపాయల మద్యం అమ్మినట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News