మందుబాబులకు తీపి కబురు..ఎమ్మార్పీ కంటే రూ.30 తక్కువకే మద్యం?

Update: 2019-12-17 09:49 GMT
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటైన జగన్ సర్కార్ ఒకవైపు మద్యం అమ్మకాల పై కొరడా జులిపిస్తుంటే .. మరోవైపు కొంతమంది మాత్రం తాగినోడికి తాగినంత అన్నటుగా ఆఫర్లు పెట్టి అమ్ముతున్నారు. అది కూడా ఎదో దొంగ చాటుగా కూడా కాదు ...యథేచ్ఛగా షాప్ ముందు పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి మరి మద్యాన్ని అమ్ముతున్నారు. సాధారణంగా మద్యాన్ని  మద్యం షాపుల్లో - బార్‌ అండ్‌ రెస్టారెంట్ లలో  అధిక ధరకి అమ్ముకొని సొమ్ము చేసుకుంటుంటారు. కానీ , తాడిపత్రి లోని ఒక బార్‌ అండ్‌ రెస్టారెంట్ లలో . ఎమ్మార్పీ కంటే రూ.30 తక్కువకే  మద్యాన్ని అమ్ముతున్నారు.   అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ..బ్రాండెడ్‌ సరుకైనా కానీ - కొంచెం తాగగానే ఫుల్ కిక్ ఎక్కుతుండటం తో బ్రాండెడ్ బాటిల్స్ లో చీఫ్ లిక్కర్ వేసి అమ్ముతున్నారు అని కొందరు ఆరోణపణలు చేస్తున్నారు. కానీ , ఇంత జరుగుతున్న  ఎక్సైజ్‌ శాఖ అధికారులు అటువైపు కూడా పోకపోవడం  గమనార్హం.

దీనిపై పూర్తి వివరాలు చూస్తే ..  తాడిపత్రి పట్టణంలో మొత్తం మూడు బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ లు ఉన్నాయి. అవన్నీ కూడా జేసీ సోదరుల అనుచరులే నిర్వహిస్తున్నారు.ఇన్ని రోజులపాటు ఒకలా వ్యాపారం కొనసాగించిన వారు ..ఇప్పుడు మరోలా వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తాడిపత్రి పోలీసు స్టేషన్‌ సమీపంలోనే ‘హిమగిరి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌’ యజమాన్యం  సరికొత్త కొత్త దందాకు తెర తీశారు.

ఎవరైనా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేయాలంటే లైసెన్స్‌ కోసం రూ.లక్షల్లో ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఈ మేరకు సంపాదించేందుకు అవసరమైతే అదనపు ధరలతో మద్యం ప్రియుల జేబులు ఖాళీ చేస్తారు. కానీ ఇందుకు విరుద్ధంగా హిమగిరి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యాజమాన్యం ఎమ్మార్పీ కంటే తక్కువకు మద్యం విక్రయిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తం అవు తున్నాయి. ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు మద్యాన్ని విక్రయించినా.. ఎక్కువ ధరకు విక్రయించినా ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

కానీ పట్టణం నడిబొడ్డున హిమగిరి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యాజమాన్యం ఏకంగా ఫ్లెక్సీ వేసి మరీ తక్కువ ధరకు మద్యం విక్రయిస్తున్నా ఎక్సైజ్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అలాగే గతంలో ఎమ్మార్పీ కంటే రూ.30 నుంచి రూ.50 వరకు అదనంగా తీసుకున్న బార్‌ నిర్వాహకులు ఇప్పుడు హఠాత్తుగా రేటు తగ్గించడం.. బ్రాండెడ్‌ మద్యం తీసుకున్నా.. కొంచెం తాగగానే కిక్కు ఎక్కుతుండటంపై పలు  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ లిక్కర్‌ దందాకు అడ్డుకట్ట వేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అలాగే కర్ణాటక ప్రాంతం నుంచి అక్రమంగా మద్యాన్ని దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తున్నారా? లేక ఇన్ని రోజు లు నిల్వఉంచిన పాత స్టాకును ఇప్పుడు తక్కువ ధరకే విక్రయిస్తున్నారా! అనే అనుమానాలు కలుగుతున్నాయి.
Tags:    

Similar News