పొగతాగని వాడు దున్నపోతై పుట్టును అన్నాడు గిరీషం. కానీ ఇప్పుడు మద్యం తాగని వాడు కూడా దున్నపోతై పుడతాడు అంటున్నారు నవతరం గిరీషంలు.. మద్యం అనేది ఇప్పుదు దైనందిన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. మగవాళ్లు వీకెండ్ వచ్చిందంటే చాలు పార్టీలు - పబ్బులంటూ మద్యం తెగ తాగేస్తున్నారు.
అయితే ఆశ్చర్యకరంగా మద్యం వినియోగం దేశంలో బాగా పెరిగిపోయిందట.. ఇందంతా మగాళ్లు తాగడం వల్ల పెరిగిందనుకుంటే మందు గ్లాసులో కాలేసినట్టే.. మహిళలు మద్యం తాగడం వల్లే దేశంలో మద్యం వినియోగం పెరిగిందని ఓ సర్వేలో తేలింది.
ఢిల్లీకి చెందిన ‘కమ్యూనిటీ అగెనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్(సీఏడీడీ)’ చేసిన సర్వేలో మహిళలు మద్యం తాగడం ఎక్కువైనందు వల్లే దేశంలో మద్యం వినియోగం పెరిగిందని తేల్చారు. మహిళలు కూడా ఉద్యోగాలు చేయడం.. పెరిగిన సంపాదన - కోరికలు - సామాజిక ఒత్తిళ్లు - కొత్త తరహా జీవనశైలికి అలవాటు పడడం వంటి కారణాలతో మహిళలు మద్యం వైపు ఆకర్షితులవుతున్నట్టు సర్వే తేల్చింది.
ఢీల్లీలోని 18-70 ఏళ్ల వయసున్న 5వేల మందిపై సర్వే చేయగా.. పురుషుల్లో 40శాతం - మహిళల్లో 20శాతం మంది మద్యం తాగుతారని తేలింది. ఈ లెక్కలను బట్టే దేశంలో మద్యం వినియోగం 2010తో పోల్చితే తాజాగా 38శాతం పెరిగిందని సర్వే తేల్చింది. సో మగాళ్లే కాదు.. ఆడవాళ్లు కూడా మందు తాగడం వల్లే ఈ పెరుగుదల కనిపించిందని సర్వే తేల్చింది.