పెళ్లి పత్రికలో లైవ్ లింక్ .. ఆన్లైన్ లో చూసి , విందు భోజనం తింటూ ఆశీర్వదించండీ !

Update: 2020-11-26 01:30 GMT
కరోనా వైరస్ ఏ ముహూర్తాన వెలుగులోకి వచ్చిందో కానీ , ఆ ఒక్క మహమ్మారి దెబ్బకి మొత్తం ప్రపంచం యొక్క జీవన విధానమే పూర్తిగా మారిపోయింది. కరోనా రాకముందు అలా ఉన్నాం , ఇప్పుడు ఇలా ఉంటున్నాం అని అనుకుంటున్నారు. ఇక పెళ్లిళ్ల గురించి అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ కరోనా ఈ కాలంలో జరుగుతున్న విచిత్రమైన పెళ్లిళ్ల గురించి తెలిస్తే మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టాన్ని కూడా ఇలా ఊహించలేనంత మార్పుల్ని చేసేస్తున్నావ్ అనిపిస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ లో ఇటువంటి పెళ్లే జరిగింది . కరోనా నియమాలు ఉండటంతో పెళ్లికి వందమందికి మించి బంధువులు, స్నేహితులను పిలిచే పరిస్థితులు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో వివిధ పట్టణాలో విభిన్న రీతులలో వివాహాలు జరుగుతున్నాయి.

ఇక పెళ్ళి రోజు వచ్చేసరికి దానిని లైవ్ టెలీకాస్ట్ చేస్తున్నారు. వివాహానికి హాజరుకాలేనివారంతా లైవ్‌లో దానిని చూడండీ. ఆశీర్వదించండీ అని కోరుతున్నారు. దీనితో పెళ్లి కార్డులోనే ఈ లైవ్ స్ట్రీమ్‌ కు సంబంధించిన లింక్ కూడా ప్రింట్ చేస్తున్నారు. అలాగే బంధువులందరితో కూడిన ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తున్నారు. అలాగే పెళ్లి విందు పార్సిళ్లను బంధువులు, స్నేహితులు ఇళ్లకు డోర్ డెలివరీ చేస్తున్నారు. ఈ విధమైన పెళ్లి వేడుకలకు ప్రస్తుతం ఎంతో ఆదరణ దక్కుతున్నదని వెడ్డింగ్ ప్లానర్స్ చెబుతున్నారు. ఇలా కరోనా కాలంలో కొత్త కొత్త రకాలుగా పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. ఎవరి క్రియేటివిటీని వాళ్లు వాడుకుంటూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఏదేమైనా కరోనా దెబ్బకి పెళ్లిళ్ల లో కూడా భారీగా మార్పులు వచ్చేశాయి. అయితే , ఇలాంటి మార్పుల వల్ల కొందరికి టైం , మనీ సేవ్ అవుతుంది.
Tags:    

Similar News