లైవ్: ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీది అధికారమంటే?

Update: 2021-05-02 07:52 GMT
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు దాదాపు చివరి దశకు వచ్చింది. మధ్యాహ్నం 1 గంట వరకు వచ్చిన సీట్ల సమాచారం ప్రకారం.. ఐదు రాష్ట్రాల్లో మూడింట అధికార పార్టీలు మరోసారి అధికారం చేపట్టనుండగా.. రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు అధికారంలోకి రాబోతున్నాయి.

పశ్చిమ బెంగాల్ లో అధికార టీఎంసీ మరోసారి అధికారం చేపట్టే దిశగా సాగుతోంది. ఇక కేరళలో అధికార ఎల్డీఎఫ్ విజయం తథ్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థులు మేజిక్ మార్క్ ను దాటేశారు. ఇక అసోంలోనూ అక్కడి అధికార బీజేపీ మరోసారి  అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక దక్షిణాదిలోని తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకే అధికారంలోకి రాబోతోంది. ఆ పార్టీ ఇప్పటికే మేజిక్ మార్క్ మెజార్టీని దాటేసింది. ఇక పక్కనే ఉండే పుదుచ్చేరి రాష్ట్రంలోనూ ప్రతిపక్ష ఎన్డీఏ విజయం దిశగా సాగుతోంది.

-తిరుపతి వైసీపీదే..
ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తిరుపతిలో వైసీపీ దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థి గురుమూర్తికి ఇప్పటికే 229424 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థికి 133613 ఓట్లు వచ్చాయి. మెజార్టీ దాదాపు లక్ష దాటేసి వైసీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఇక్కడ బీజేపీకి 23,223 ఓట్లు మాత్రమే వచ్చాయి..

-నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ విన్ గ్యారెంటీ
నాగార్జున సాగర్ లో అధికార టీఆర్ఎస్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 56369 ఓట్లతో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 45127 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి కేవలం 5123 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాదాపు 11 వేల ఓట్ల మెజార్టీ ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు.  

-బెంగాల్ లో మమత హ్యాట్రిక్ ఖాయం
బెంగాల్ లో టీఎంసీ 205 చోట్ల లీడ్ లో ఉంది. ఇక బీజేపీ 83 స్తానాలకే పరిమితమైంది. సీపీఎం 2 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఇతరులు 3 చోట్ల లీడ్ లో ఉన్నారు.

-తమిళనాడు డీఎంకేదే..
తమిళనాట ప్రతిపక్ష డీఎంకే 140  చోట్ల లీడ్ లో ఉంది. అధికార అన్నాడీఎంకే 93 సీట్లతో వెనుకబడింది. ఎంఎన్ఎం ఒక చోట ఆధిక్యంలో ఉంది. మేజిక్ మార్క్ ను మించి డీఎంకే సీట్లు ఆధిక్యంలో ఉండడంతో స్టాలిన్ సీఎం కావడం గ్యారెంటీగా కనిపిస్తోంది.

-కేరళ మరోసారి కమ్యూనిస్టులదే
కేరళలో మరోసారి అధికార ఎల్డీఎఫ్ దే అధికారం ఖాయమని తేలింది. ఇప్పటికే ఎల్డీఎఫ్ 93 సీట్ల లీడ్ లో ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి 45 చోట్ల లీడ్ లో ఉంది. 140 సీట్ల కేరళలో 71 స్థానాలు వస్తే విజయం. కానీ ఎల్డీఎఫ్ అంతకుమించి సీట్లను సాధించి అధికారంలోకి రాబోతోంది.

-అసోంలో మళ్లీ బీజేపీనే
అసోంలో అధికార బీజేపీ మరోసారి అధికారంలోకి రాబోతోంది. మొత్తం 126 సీట్లలో బీజేపీ ఇప్పటికే 60 చోట్ల  లీడ్ లో ఉండగా. కాంగ్రెస్ 26 చోట్ల, ఏజేపీ 10 చోట్ల, ఇతరులు 23 చోట్ల లీడ్ లో ఉన్నారు.

-పుదుచ్చేరిలో బీజేపీనే
పుదుచ్చేరిలో అధికార యూపీఏ ఓటమిదిశగా  సాగుతోంది. ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి అధికార దిశగా సాగుతోంది. ఎన్టీఏ కూటమి 11 చోట్ల లీడ్ లో ఉండగా.. కాంగ్రెస్ 4 చోట్ల, ఇతరులు 2 చోట్ల లీడ్ లో ఉన్నాయి. మేజిక్ మార్క్ 16. బీజేపీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.
Tags:    

Similar News