బీజేపీ కురువృద్ధుడు.. లోక్ సభలో రెండంటే రెండు సీట్లు ఉన్న స్థానం నుంచి భారీ మెజార్టీతో పార్టీని పవర్ లోకి తేవటంలో కీలక భూమిక పోషించిన బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీకి ఎదురవుతున్న అవమానాలు అన్ని ఇన్ని కావు. చివరకు ఇదెంతవరకు వెళ్లిందంటే.. ఆయన ప్రాతినిధ్యం వహించే గాంధీ నగర్ నుంచి పోటీ చేసేందుకు ఆయనకు అవకాశం ఇవ్వకపోవటం.
ఇటీవల బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో అద్వానీ పేరు లేకపోవటం అందరి దృష్టిని ఆకర్షించింది. 91 ఏళ్ల వయసులో అద్వానీ పోటీకి దిగలేరన్న మాటను బీజేపీ నేతలు చెప్పినా.. పెద్దాయన నోటి నుంచి మాత్రం ఆ మాట చెప్పించకపోవటంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదే సమయంలో.. ఆ స్థానం నుంచి బీజేపీ జాతీయాధ్యక్షుడు కమ్ మోడీకి మరో రూపంగా చెప్పే అమిత్ షాకు కేటాయించటంతో ఈ అనుమానాలు బలపడ్డాయి.
ఇదిలా ఉంటే.. పెద్దాయనతో మాట్లాడిన.. ఆయన చెప్పిన తర్వాత మాత్రమే టికెట్ నుంచి షాకు కేటాయించినట్లుగా బీజేపీ సన్నాయి నొక్కులు నొక్కింది. ఇందులో వాస్తవం లేదన్న విషయంపై ఎవరూ నోరు విప్పని వేళ.. తాజాగా ఒక వార్త తెర మీదకు వచ్చింది. తనకు టికెట్ కేటాయించే విషయంలో పార్టీ వ్యవహరించిన తీరుకు అద్వానీ తీవ్ర మనస్తాపానికి గురైనట్లుగా చెబుతున్నారు.
ఎన్నికల తొలి జాబితాలో తన పేరు లేకపోవటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నట్లుగా చెబుతున్నారు. ఆ మాటకు వస్తే.. తనకు టికెట్ కేటాయించని విషయాన్ని ముందుగా చెప్పటం కానీ..అనుమతి తీసుకోవటం కానీ చేయలేదని చెబుతున్నారు. తనకు అత్యంత సన్నిహితుల వద్ద ఆయన తీవ్రంగా పీలైనట్లుగా చెబుతున్నారు. ఈసారి పోటీకి దించకుండా.. ఆయనస్థానంలో అమిత్ షా గాంధీనగర్ బరిలో నుంచి దిగనున్న విషయాన్ని మాట వరసకు సైతం చెప్పకపోవటంపై ఆయన హర్ట్ అయినట్లు చెబుతున్నారు. ఇది కచ్ఛితంగా అవమానకరంగా అద్వానీ సన్నిహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే పనిగా అవమానాలకు గురి చేస్తున్న శిష్యులపై అద్వానీ ఒకసారి నోరు విప్పితే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. మౌనంగా ఉండే కన్నా.. ఒకసారి నోరు విప్పి కడిగిపారేస్తే మంచిదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.