మనసులో చెలరేగే తుఫానుని ముఖం మీద కనిపించకుండా ఉండటం అందరికి సాధ్యమయ్యే పని కాదు. రాజకీయాల్లో తల పండినా.. మోతాదు మించిన ఉద్వేగాన్ని ముఖం మీదనో.. మాటల్లోనే ప్రదర్శించే వైఖరి బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీకి మామూలే. అరుదుగా మాత్రమే ఇలా వ్యవహరించే ఆయన బుధవారం తనదైన శైలిలో చెలరేగిపోయారు. నోట్ల రద్దు నేపథ్యంలో శీతాకాల సమావేశాలు మొత్తం అధికార.. విపక్షాల ఆందోళనల మధ్య ఎలాంటి చర్చా లేకుండానే వాయిదాల మీద వాయిదాలు పడటంపై ఆయనకు కోపం వచ్చేసింది.
బుధవారం సభలో కొందరు విపక్ష సభ్యులు అధికార ఎంపీల సీట్ల వద్దకు వచ్చి వెల్ లో నినాదాలు చేస్తుండటంతో మంత్రి అనంత్ కుమార్ పై అద్వానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ కార్యకలాపాలను స్పీకర్ నడపటం లేదు..ఈ విషయాన్ని ఆమెకే చెబుతాను.. ఇదే విషయాన్ని బయటకూ చెబుతాను.. ప్రస్తుత పరిస్థితికి అధికార.. విపక్షాలదే బాధ్యత అంటూ మండిపడిన ఆయన తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
నోట్ల రద్దుపై చర్చ జరపాలంటూ విపక్షాలు చేస్తున్న ఆందోళనల మధ్య సభను నడపటం సాధ్యం కాని నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ సభను వాయిదా వేశారు. దీంతో.. అద్వానీ అక్కడి అధికారిని ఎంతసేపు వాయిదా అని అడగ్గా.. 15 నిమిషాలంటూ బదులివ్వగా.. ‘‘నిరవధికంగా వాయిదా వేసేయొచ్చుగా’’ అంటూ వెళ్లిపోవటంతో.. అదే సమయంలో లోక్ సభలో వార్తల్ని కవర్ చేసే మీడియా వైపునకు తిరిగి.. ఈ వార్తను కవర్ చేయాలని చెబుతూ సభ నుంచి వెళ్లిపోయారు. గడిచిన కొద్ది కాలంగా మౌనంగా ఉంటున్న అద్వానీకి ఉన్నట్లుండి ఇంత కోపం రావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో గడిచిన 14 రోజులుగా లోక్ సభ కార్యకలాపాలు విపక్షాల ఆందోళనతో తుడిచి పెట్టుకుపోయాయి. కురువృద్ధుడికి వచ్చిన కోపాన్ని అధికారపక్ష నేతలు ఎలా కంట్రోల్ చేస్తారో..?