అధికారపక్షం ఎంత అణుకువగా ఉంటే అంత మంచిది. చేతిలో ఉన్న పవర్ ను ఇష్టారాజ్యంగా వినియోగించే నేతలే కాదు.. కిందిస్థాయి క్యాడర్ కారణంగా కూడా నష్టం వాటిల్లేలా చేస్తుంది. అధినేత ఎంత కరెక్ట్ గా ఉన్నప్పటికీ.. ఇష్టారాజ్యంగా వ్యవహరించే క్యాడర్ కారణంగా ప్రభుత్వానికి భారీగా చెడ్డపేరు ఖాయం.
తాజాగా ఒక వీడియో వైరల్ అవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం నిర్మిస్తున్న ఒక ఫంక్షన్ హాల్ నిర్మాణంలో ఉంది. దాన్ని ఇంకా ఓపెన్ చేయలేదు. కానీ.. టీఆర్ ఎస్ కు చెందిన ఛోటా నేతలు పలువురు కలిసి.. దాన్ని పబ్ గా మార్చేశారు.
సికింద్రాబాద్ సమీపంలోని సీతాఫల్ మండిలో ఇంకా పూర్తి కాని ఫంక్షన్ హాల్లో భారీగా వేడుకను నిర్వహించారు. విందు.. వినోదాలతో.. పెద్ద సౌండ్ తో డీజేపీ పెట్టి.. ఎంజాయ్ చేసేస్తున్నారు. డ్యాన్సులతో హడావుడి చేస్తూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ఎంత వారి ప్రభుత్వమైతే మాత్రం.. ఎలాంటి అనుమతులు లేకుండా ఇలా ఎలా పార్టీలు చేస్తారని అక్కడి స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చేతిలో అధికారం ఉంది కదా? అని చెలరేగిపోతే నష్టం తప్పదని చెప్పాలి. రాత్రిళ్లు చాలాసేపు పెద్ద చప్పుళ్లతో చేసుకున్న పార్టీతో అక్కడి పెద్ద వయస్కులు.. మహిళలు.. చిన్నారులకు నిద్రాభంగం జరిగినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వాటి విషయంలో కేసీఆర్ సీరియస్ కాకుంటే పార్టీకి జరిగే నష్టం భారీగా ఉంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మరి.. కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.
Full View