దేశానికి స్వాతంత్ర్యం వచ్చి.. ఆరు దశాబ్దాలు పూర్తవబోతోంది. స్వాతంత్య్రానికి ముందు.. తరువాత కూడా ఎక్కువ కాలం కాంగ్రెస్ ప్రభుత్వమే దేశాన్ని పాలించింది. మధ్యలో కొన్ని సంవత్సరాలు బీజేపీ పాలన వచ్చినా.. పూర్తి ఆధిపత్యం మాత్రం కాంగ్రెస్ దే! కానీ 2014 ఎన్నికల తర్వాత.. రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. బీజేపీ సింగిల్ గా మెజారిటీ సాధించింది. అయితే కాంగ్రెస్.. లేకపోతే బీజేపీ ఇప్పటివరకూ ఉన్న నేషనల్ పార్టీలు ఇవే! కానీ కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ బీజేపీ - కాంగ్రెస్ లు పట్టు సాధించలేకపోయాయి! ఆ రాష్ట్రాల్లో స్థానిక పార్టీలకే ప్రజలు పట్టం కట్టారు.. కడుతున్నారు.
ఇటీవల విడుదలైన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. ఇది స్పష్టమైంది. ముఖ్యంగా తమిళనాడు - పశ్చిమబెంగాల్ లో స్థానిక పార్టీలు విజయ ఢంకా మోగించాయి. అయితే గత నాలుగేళ్లలో జరిగిన ఎన్నికలు చూస్తే. స్థానిక పార్టీల హవా ఎక్కువైందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఏపీలో తెలుగుదేశం.. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ.. తమిళనాడులో అన్నాడీఎంకే.. పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్.. తెలంగాణలో టీఆర్ ఎస్.. ఇలా స్థానిక పార్టీల బలం నానాటికీ పెరుగుతోంది.
ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు సహా.. 2012 నుంచి ఇప్పటివరకూ దేశంలో 30సార్లు ఎన్నికలు జరిగాయి. మొత్తం 4,117 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో.. 1,051 స్థానాల్లో బీజేపీ, 871 చోట్ల బీజేపీ గెలిచింది. మిగిలిన 2,195 సీట్లలో స్థానిక పార్టీలే విజయం సాధించాయి. అయితే వామపక్షాలు - బీఎస్పీ వంటి జాతీయ పార్టీలున్నా వీటి ప్రభావం కేవలం ఒకటి రెండు రాష్ట్రాలకే పరిమితమైందట. ఇదే సమయంలో బీజేపీ - కాంగ్రెస్ లతో జతకట్టని పార్టీలు 465 స్ధానాల్లో గెలుపొందాయట.
మరి ఈ ఎన్నికల్లో బీజేపీ.. 12.6 కోట్ల ఓట్లు - కాంగ్రెస్ 11.8 కోట్లు - ఇతర పార్టీలు 33.5 కోట్లు వచ్చాయట. అంటే కేవలం ఈ రెండు పార్టీలకి కేవలం 42 శాతం ఓట్లు వచ్చాయి. మిగిలిన 58శాతం ప్రాంతీయ పార్టీలే సొంతం చేసుకున్నాయి. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీల హవా నడిచింది. కాంగ్రెస్ కు 115 - బీజేపీకి 64 స్థానాలు లభించగా.. ఇతర పార్టీలకు 640 పై చిలుకు స్థానాలు వచ్చాయి. వీటిని బట్టి రానున్న కాలంలో ప్రాంతీయ పార్టీలదే పూర్తి ఆధిపత్యం అని చెప్పవచ్చు. ఈ లెక్కన ఒక వేళ కాంగ్రెస్ - బీజేపీ ఒక్కటైనా ప్రాంతీయ పార్టీలదే హవా అని ఈ లెక్కలను బట్టి తేలుతోంది.