ముంబై సముద్రంలో వెయ్యి రూపాయిల నోట్లు

Update: 2015-08-12 16:33 GMT
ఆ మధ్యన కొండ ప్రాంతంలో కరెన్సీ నోట్లు కనిపించటంలో కలకలం రేగిన విషయం తెలిసిందే. తాజాగా.. ముంబయి సముద్రంలో వెయ్యి రూపాయి నోట్లు కొట్టుకొచ్చిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

బుధవారం ముంబయి నగరం నడిబొడ్డున ఉండే గేట్ వే దగ్గరున్న సముద్ర తీరానికి వెయ్యి రూపాయిల నోట్లు దర్శనమివ్వటంతో పలువురి నోట మాట రాని పరిస్థితి. కళ్ల ముందు కళకళలాడుతున్న వెయ్యి రూపాయిల నోట్లను చూసిన పలువురు ఈత వచ్చిన కుర్రాళ్లు సముద్రంలోకి దూకి దొరికిన కాడికి వెయ్యి నోట్లను సొంతం చేసుకున్నారు.

సముద్రంలో వెయ్యి నోట్లు అన్న మాటతో పెద్ద ఎత్తున యువకులు చేరి.. ఆసక్తిగా గమనించారు. సముద్ర  ప్రవాహం ఎక్కువగా ఉండటం.. అప్పటికే అక్కడకు చేరిన పోలీసులు పలువుర్ని సముద్రంలోకి దూకకుండా నిలువరించారు. వెయ్యి నోట్లు ఈ విధంగా కొట్టుకు రావటం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అయితే.. సముద్రంలో ప్రయాణించే ప్రయాణికుడు ఎవరైనా ఒకరు పొరపాటున డబ్బు సంచిని సముద్రంలో పారేసుకున్నందున ఇలా జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ముంబయి మహా నగరంలోని సముద్రంలో ఉంటే.. పోలీసులు మరిన్ని కోణాల్లో దృష్టి పెడితే బాగుంటుందన్న భావన వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News