ఇది ఏ ప్రాంతానికో లాక్ డౌన్ కాదు, తెలంగాణ న్యాయవ్యవస్థకు సంబంధించిన లాక్ డౌన్. కరోనా ఏ మాత్రం తగ్గుతున్న దాఖాలు కనిపించని నేపథ్యంలో కోర్టులకు లాక్ డౌన్ వచ్చే నెల 5వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అత్యవసర కేసులు, తుది విచారణలో ఉన్న కేసులు మాత్రం వీడియోకాన్ఫరెన్స్ తో విచారణ చేయాలని జిల్లా కోర్టులకు ఆదేశాలు ఇచ్చింది. పిటిషన్ల దాఖలు సదుపాయాన్ని మాత్రం కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. అందరికీ అన్ని ప్రాంతాల్లో ఆన్లైన్ సాధ్యం అయ్యే పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకే పిటిషను ఆన్లైన్లో అయినా వెయ్యొచ్చు... ఆఫ్ లైన్లో అయినా వెయ్యొచ్చు అని హైకోర్టు తెలిపింది. అయితే, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో మాత్రం నేరుగా పిటిషన్లు వేయడానికి కుదరదు. కోర్టుల వద్ద అన్నివిధాలుగా శుభ్రత పాటించాలని, శానిటైజేషన్, మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి అని స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే... తెలంగాణలో గత 24 గంటల్లో 1896 కరోనా కేసులు రికార్డయ్యాయి. వీటితో తెలంగాణ కరోనా కేసుల సంఖ్య 82,647కి చేరింది. 8 మంది మరణించారు.