ఓవైపు అంతకంతకూ తగ్గుతున్న కరోనా కేసుల నేపథ్యంలో.. ప్రస్తుతం అమలు చేస్తున్న లాక్ డౌన్ ను మరింత పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరో మూడు నెలల్లో మూడో వేవ్ వచ్చే వీలుందన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు రావటంతో లాక్ డౌన్ పరిమితుల్ని పొడిగించాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయింది. తాజాగా లాక్ డౌన్ వేళల్ని పొడిగించటం ద్వారా వ్యాపారాలు పుంజుకునే వీలు ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు లాక్ డౌన్ ను ఎత్తేస్తూ..సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరు వరకు లాక్ డౌన్ అమలు చేయటం తెలిసిందే.
పది రోజుల పాటు ఈ విధానాన్ని అమలు చేస్తామని చెబుతున్నారు. ఈ గడువు 19తో ముగియనుంది. దీంతో.. 20నుంచి ఎలా ఉంటుందన్న చర్చ నడుస్తోంది. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. లాక్ డౌన్ ను సాయంత్రం ఆరు నుంచి రాత్రి తొమ్మిది వరకు పొడిగించటం ఖాయమని చెబుతున్నారు. మరి.. థియేటర్లు.. మల్టీఫ్లెక్సుల మాటేమిటి? అని ప్రశ్న తెర మీదకు వస్తోంది.
ప్రభుత్వం థియేటర్ల మీద ఉన్న పరిమితుల్ని ఎత్తేస్తుందని చెబుతున్నారు. అయినప్పటికి థియేటర్లు తెరుచుకునే అవకాశం లేదంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాత్రి తొమ్మిది గంటల వరకు లాక్ డౌన్ పొడిగించి.. థియేటర్లకు అనుమతించినా.. మూడు షోలకు మించి అవకాశం ఉండదు. అలాంటప్పుడు అరకొర షోలతో ఖర్చు ఎక్కువ కావటం.. ఆదాయం ఉండదన్న అభిప్రాయం నెలకొంది.
దీనికి తోడు.. ఇప్పటికిప్పుడు సినిమాలు విడుదలయ్యే అవకాశం లేదు. పెద్ద హీరోల సినిమాలు విడుదల చేసినా.. మూడు షోలతో కలెక్షన్లు దారుణంగా ఉంటాయని.. అలాంటప్పుడు థియేటర్లను తెరిచే కన్నా.. మూసి ఉంచటం మంచిదన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే.. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తి వేసిన తర్వాత మాత్రమే థియేటర్లను ఓపెన్ చేసే అంశాన్ని థియేటర్ల యజమానులు.. మల్టీఫ్లెక్సు అధినేతలు పరిశీలిస్తామన్న మాట వారి నోటి నుంచి వస్తోంది.
లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసినప్పటికీ.. భారీ చిత్రాలు.. పెద్ద హీరోల సినిమాలతో పాటు.. అంచనాలు ఎక్కువగా ఉన్న మూవీలు విడుదలయ్యే అవకాశం తక్కువేనని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ ఎత్తేసినా.. ప్రజల మైండ్ సెట్ లో మార్పు వచ్చి.. వినోదం కోసం థియేటర్ వద్దకు రావటానికి కొంత టైం పడుతుందని.. ఆ సమయంలో కలెక్షన్లు తక్కువగా ఉండటంతో సినిమాల్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉండరని చెబుతున్నారు. అలాంటిది లాక్ డౌన్ రాత్రి తొమ్మిది వరకు పొడిగించినప్పటికీ థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు.