8 నుంచి నైట్ కర్ఫ్యూ.. 50శాతం ఆక్యూపెన్సీ వార్త తప్పుడు ప్రచారమేనా?

Update: 2022-01-08 05:30 GMT
దేశంలో లాక్ డౌన్ విధించబోతున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇప్పుడు అందరిలోనూ ఆందోళనకు కారణమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ పంజా విసురుతోంది. అమెరికా, యూరప్ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి.  అమెరికాలో అయితే రోజుకు 10 లక్షల కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇక దేశంలోనూ ఒమిక్రాన్ ఎంటర్ అయ్యింది. దీంతో నిన్న ఏకంగా లక్షకుపైగా కేసులు ఒక్కరోజులోనే నమోదయ్యాయి.

ప్రధాని నరేంద్రమోడీ సీఎంలతో భేటి కావడం.. కరోనా పరిస్థితిపై సమీక్షించాక మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్ ఖాయమని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ నెల 8 నుంచి (ఈరోజు) నైట్ కర్ఫ్యూ.. 50శాతం ఆక్యూపెన్సీతో బార్లు, రెస్టారెంట్లు, పబ్ లు, సినిమా థియేటర్లపై ఆంక్షలు విధిస్తారని ఒక డిటెయిల్డ్ న్యూస్ సోషల్ మీడియాలో నిన్నటివరకూ జోరుగా ప్రచారం సాగింది. దీన్ని నమ్మి మీడియా కూడా ఆంక్షలు 8 నుంచి అని హోరెత్తించాయి. ఆంధ్రాలో నైట్ కర్ఫ్యూ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇక మోడీనే మరోసారి జనవరి నెలాఖరుకు నైట్ కర్ఫ్యూ, 50శాతం ఆక్యూపెన్సీతో నడిపించాలని విధించబోతున్నారన్న వార్త ప్రచారమవుతోంది. సోషల్ మీడియాలో, మీడియాలో ఇప్పుడు ఇదే వైరల్ అయ్యింది.  

అయితే మరోసారి ఈ ఆంక్షలు పెట్టి దేశాన్ని ఆర్థిక విపత్తులోకి దిగజార్చడం ఆమోద యోగ్యం కాదని ప్రభుత్వాలు భావిస్తున్నట్టు తెలిసింది.  న్యూఇయర్, క్రిస్మస్ వేడుకలకు సైతం నిబంధనలు పెట్టకుండా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మినహాయింపులు ఇచ్చారు. కేసులు పెరుగుతాయని తెలిసినా.. ఆదాయం కోసం తప్పలేదు. ఇక ఏపీలోనూ జగన్ ముందు నుంచి ఆంక్షలపై  ఆచీతూచీగానే వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా ఏపీలో లాక్ డౌన్ కు అవకాశమే లేదని ఏపీ ఆరోగ్యశాఖ వివరణ ఇచ్చింది.

ఈ క్రమంలోనే అసలు 8 నుంచి నైట్ కర్ఫ్యూ, 50శాతం ఆక్యూపెన్సీ అనేది లేదని తేలిపోయింది. ఎందుకంటే ఈరోజు అటు తెలంగాణ, ఇటు ఏపీ ప్రభుత్వం నుంచి దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. సో ఆంక్షలు ఇప్పటికిప్పుడు లేదు. కేసులు పెరిగితే అప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. సోషల్ మీడియాలో జరిగిన నైట్ కర్ఫ్యూ, 50శాతం ఆక్యూపెన్సీ ఫేక్ న్యూస్ అని తేలిపోయింది.  ఈ సంక్రాంతి బరిలో ఇప్పటికే కొన్ని సినిమాలున్నాయి. అవి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆంక్షల భయాలతో ఆ సినిమా యూనిట్లు కంగారుపడుతున్నాయి. కానీ అలాంటిది ఏమీ లేదని.. సంక్రాంతి సినిమాలకు వచ్చిన ఢోకా ఏమీ లేదని సమాచారం. ఆంక్షలు పెట్టే ఉద్దేశం రెండు తెలుగు రాష్ట్రాలకు లేదని తెలుస్తోంది.
Tags:    

Similar News