దేశంలో లాక్ డౌన్ పొడిగింపు? ఎన్నిరోజులంటే?

Update: 2020-04-05 04:53 GMT
ఏప్రిల్ మొదటి వారం పూర్తయ్యేసరికి కరోనా కేసులు తగ్గి తెలంగాణ కరోనా ఫ్రీ అవుతుందని  మొదట్లో కేసీఆర్ ధీమాగా చెప్పుకొచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన ‘తబ్లిఘీ’ సమావేశాల పుణ్యమాని  ఇప్పుడు కరోనా విస్తరిస్తూ విశృంఖలంగా వ్యాపిస్తోంది.

ఢిల్లీ ప్రార్థనల తాలూకూ కేసులు లేకుంటే ఇప్పటికీ దేశం కరోనా నుంచి ఫ్రీ అయ్యేది. విదేశాల నుంచి వచ్చిన వారితోనే ఆగిపోయేది. తబ్లిఘీ సమావేశాలతో విస్తరించింది.

మర్కజ్ లింకుల కారణంగా దేశంలో కరోనా వ్యాపిస్తుండడంతో ఏప్రిల్ 14వరకే లాక్ డౌన్ పొడిగిద్దామని చూసిన కేంద్రం తాజాగా మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగింపునకు యోచిస్తున్నట్టు తెలిసింది. మూడు నాలుగు రోజులుగా దేశంలో మర్కజ్ కారణంగా పెరుగుతున్న విపరీతమైన కేసుల కారణంగా లాక్ డౌన్ కొనసాగిస్తేనే కట్టడి చేయవచ్చన్న ఆలోచనలకు కేంద్రం వచ్చినట్టు సమాచారం.

ప్రస్తుతం విస్తరిస్తున్న కరోనా కారణంగా దేశంలో మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ ను పొడిగించే అవకాశాలున్నట్టు ఢిల్లీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తబ్లీగీ జమాత్ వల్లే ఈ దుస్థితి దాపురించినట్టు తెలిసింది.

ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే కరోనా కేసులు లాక్ డౌన్ తో విమాన సర్వీసుల నిలుపుదల వల్ల తగ్గాయి. వారు అంటించిన వారు చికిత్స పొందుతున్నారు.ఏప్రిల్ 9వ తేదీ వరకు అంతా అనుకున్నట్టు జరిగితే కరోనా దేశంలో నియంత్రణలోకి వచ్చేది. ఏప్రిల్ 15న లాక్ డౌన్ ఎత్తివేశారు. కానీ అనూహ్యంగా ఢిల్లీలో మర్కజ్ ప్రార్థనల వల్ల దేశవ్యాప్తంగా రోజుకు 500 కేసులు పెరుగుతూ పోతున్నాయి. తబ్లిగీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు.. వారు కలిసిన వారు, కుటుంబ సభ్యులు కలిసి 22వేల మందికి పైగా ఉన్నారని కేంద్రం గుర్తించింది.ఇప్పటివరకు 1023మందికి కరోనా పాజిటివ్ రాగా.. మిగిలిన వారంతా క్వారంటైన్లో ఉంటున్నారు. తబ్లిగీకి చెందిన వారే దేశంలో 30శాతం కరోనా కేసులుగా ఉన్నారు.

రాబోయే కొద్దిరోజుల్లోనే వీరికి, వీరు అంటించిన వారికి కరోనా నిర్ధారణ కానుంది. దీంతో మరో వారంపాటు లాక్ డౌన్ పొడిగించే అవకాశాలున్నట్టు కేంద్రం నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. పాజిటివ్ కేసులు పెరిగితే మాత్రం మే1 వరకు లాక్ డౌన్ దేశంలో ఖాయంగా కనిపిస్తోంది.


Tags:    

Similar News