దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా అత్యంత ప్రభావితమైన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా మహారాష్ట్రనే. కేసులు, మరణాలతో అట్టుడికిన ముంబైలో లాక్ డౌన్ విధించారు. అది ఇప్పుడు పనిచేసిందనే చెప్పాలి.
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన ఈ లాక్ డౌన్ ముంబై నగరంలో సత్ఫలితాలిచ్చింది. ముంబైలో గతంతో పోల్చుకుంటే కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య 50శాతానికి పడిపోయింది.
ఏప్రిల్ 4న ముంబై లో 11163 కేసులు నమోదుకాగా... శనివారం కేవలం 5888 కరోనా కేసులే నమోదు కావడం గమనార్హం. పాజిటివిటీ రేటు 18శాతం ఉండగా.. ప్రస్తుతం 15 శాతానికి పడిపోయింది.
లాక్ డౌన్ వల్ల ముంబైలో కరోనా వ్యాప్తి తగ్గిందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 19న కూడా ముంబైలో 8000 కేసులు నమోదయ్యాయి. కానీ కేవలం వారం రోజులు గడిచే సరికి 24 గంటల్లోనే 5888 కరోనా కేసులే నమోదు కావడం ముంబై నగర ప్రజలకు కాస్త ఊరట కలిగించే విషయంగా చెప్పొచ్చు.
ముంబైలో లాక్ డౌన్ తరహా కఠిన ఆంక్షలు అమలు చేయడం వల్లనే కరోనా కేసుల సంఖ్య తగ్గినట్లు స్పష్టమవుతోంది. ముంబై నగరంలో మొత్తం 120 కంటైన్మంట్ జోన్లను ప్రభుత్వం గుర్తించింది. మే 1 వరకు ముంబైలో కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.