బీజేపీ ఎస్కేప్ ప్లాన్ !

Update: 2018-02-09 07:16 GMT
భార‌తీయ జ‌నతా పార్టీ త‌ప్పించుకుంది.  ఆంధ్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర‌వేర్చే బాధ్య‌త‌ల నుంచి, తెలుగు ఎంపీల నిర‌స‌న‌ల నుంచి త‌ప్పించ‌కుంది. మ‌రి కొన్ని రోజులు జ‌ర‌గాల్సిన పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల‌ను అర్ధంత‌రంగా వాయిదా వేస్తూ లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నారు. స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు. మ‌ళ్లీ లోక్‌ స‌భ స‌మావేశాలు మార్చి 5న మొద‌ల‌వుతాయి. అంటే సుమారు పాతిక రోజుల పాటు స‌భ వాయిదా ప‌డింది.

ఆంధ్రులు కొత్త డిమాండ్లు చేయ‌లేదు. కేంద్రం ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌మ‌ని అడిగారు అంతే. అప్ప‌టికీ చాలాకాలం ఓపిక ప‌ట్టిన త‌ర్వాత అడిగారు. అయినా వాటిని ప‌ట్టించుకోని స్పీక‌ర్ విభ‌జ‌న హామీల‌పై చ‌ర్చ‌కు అవ‌కాశ‌మే ఇవ్వ‌లేదు. పైగా క‌బుర్లు చెప్పి త‌ప్పించుకోవ‌డానికి ప్ర‌ధాన మంత్రి మోడీకి - ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి  మాత్రం కావ‌ల్సినంత స‌మ‌యం ఇచ్చారు.

ఉద‌యాన్నే వైసీపీ ఎంపీల‌తో పాటు ఏపీ ఎంపీలంతా నిర‌స‌న చేప‌ట్టారు. ఉద‌యం నుంచి స‌భను అడ్డుకున్నారు. కొంత సేపు వాయిదా అనంత‌రం కొన్ని బిల్లులు ప్ర‌వేశ పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. కానీ మా అంశంపై చ‌ర్చకు అనుమ‌తి ఇస్తేనే దేనినైనా అంగీక‌రిస్తాం అని ఆంధ్ర ఎంపీలు ప‌ట్టుబ‌ట్ట‌డంతో బీజేపీ ఎస్కేప్ ప్లాన్ చేసింది. స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తూ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌ నిర్ణ‌యం తీసుకున్నారు.
Tags:    

Similar News