గడిచిన కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన మూడు రోజుల వ్యవధిలో దేశ వ్యాప్తంగా నమోదైన కొత్త కేసుల సంఖ్య లక్ష దాటి.. కొత్త ప్రమాద సంకేతాల్ని ఇస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్పు రాలేకపోతే.. ఇబ్బందులు తప్పవన్న హెచ్చరికల్ని చేస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్ అన్న విషయం కన్ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం లోక్ సభ.. రాజ్యసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో.. సభాధిపతిగా వ్యవహరిస్తున్న స్పీకర్ పాజిటివ్ కావటం ఆందోళనకు గురి చేస్తోంది.
ప్రస్తుతం ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించి చికిత్స చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు. స్పీకర్ కు కరోనా పాజటివ్ రావటంతో.. గడిచిన నాలుగైదు రోజులుగా ఆయన్ను కలిసిన వారంతా కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు. స్పీకర్ కు పాజిటివ్ గా తేలటం.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.