మూడు రాజధానుల పై లోక్ సత్తా అధినేత సంచలన వ్యాఖ్యలు !

Update: 2019-12-21 06:07 GMT
ప్రస్తుతం కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలు మొత్తం రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. రాష్ట్రం విడిపోయిన తరువాత గత ప్రభుత్వం అమరావతి ని రాజధానిగా ప్రకటించగా ..ఈ మధ్య అధికారం లోకి వచ్చిన వైసీపీ మళ్లీ రాజధాని పై మరో సంచలన ప్రకటన చేసింది. ఇక రాజధాని వ్యవహారం పై స్వయంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ..కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ కి మూడు రాజధానులు ఉండచ్చు అంటూ సంచలన ప్రకటన చేసారు. తాజాగా దీనిపై నిపుణుల తో కూడిన జీఎన్ రావు కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇందులో సీఎం జగన్ దాదాపు శాసనసభలో ప్రకటించిన విధంగానే, అమరావతి లో చట్టసభలు, కర్నూలులో హైకోర్టు, విశాఖలో కార్యనిర్వహక వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాక, వేసవికాల అసెంబ్లీ సమావేశాలు విశాఖ లోనే నిర్వహించాలని తెలిపారు.

ఇకపోతే , ఈ మూడు రాజధానుల వ్యవహారం పై పలువురు మేధావులు, నాయకులు స్పందిస్తున్నారు. తాజాగా లోక్‌సత్తా పార్టీ  వ్యవస్థాపకుడు డాక్టర్ జయ ప్రకాశ్ నారాయణ స్పందించారు. అభివృద్ధి వికేంద్రీకరణ లో భాగంగా మూడు రాజధానుల ప్రతిపాదన తో జయప్రకాశ్  ఆహ్వానించారు. అయితే, అమరావతి ని ఆర్థికాభివృద్ధి కి కేంద్రంగా ఉండే మహా నగరంగా రూపొందించాలని తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. దేశంలో ఎక్కడైనా మహా నగరాలైన ప్రాంతాలే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. హైదరాబాద్ లాంటి మహానగరాన్ని నిర్మించుకోవడం అవసరం అని అన్నారు.

అలాగే ఇక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా ఎంపికైన ప్రాంతం లో శాసనసభ, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, హైకోర్టు లేదా దాని ధర్మాసనం ఉంటే సరిపోతుందని , వీటన్నింటికీ 2 వేల ఎకరాలు సరి పోతుందని అన్నారు. అయితే, అసెంబ్లీ ఒక చోట, సచివాలయం మరో నగరం లో పెట్టడం ఆచరణ యోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇక హైకోర్టు ను కర్నూలుకు తరలించాలన్న వాదన మంచిదేనన్న ఆయన.. అమరావతి, విశాఖపట్నాల్లో హైకోర్టు ధర్మాసనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు తమ పనుల కోసం ముఖ్యమంత్రి దగ్గరికి, లేదా రాజధానికి వచ్చే అవసరం లేకుండా చేయడమే నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ అని అయన అన్నారు.
Tags:    

Similar News