తెదేపా కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరక్ ఒబామాను కలిసిన లోకేష్... ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, నూతన పారిశ్రామిక విధానం, అమరావతి నగర నిర్మాణం మొదలైన విషయాల గురించి వివరించారు! ఇదే సమయంలో శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రవాసాంధ్రులతో సమావేశమైన లోకేష్... తెలుగు ఎన్నారైలకు సూచనలు చేశారు.
రాష్ట్రాభివృద్ధిలో ముందుకు కదలాలని, ప్రతీఒక్కరి చేయూత రాజధాని నిర్మాణంలో ఉండాలని పిలుపునిచ్చారు! కేవలం పెట్టుబడులు పెట్టడం మాత్రమే కాదు.. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు కూడా ప్రవాసాంధ్రులు కదలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏపీ అభివృద్ధిపై తన విజన్ ను వివరించేలా తయారుచేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను వారికి వివరించిన లోకేష్... ప్రతీ పల్లే అభివృద్ధి చెందాలని, అందుకోసం తమవంతుగా ఎన్నారైలు సమయం కేటాయించాలని కోరారు. టీడీపీ ప్రభుత్వం కుప్పంలో చేపట్టిన విన్యూత్న పథకం ఎనీ టైమ్ వాటర్ స్కీమ్, ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాల గురించి వివరించారు!
సాంకేతిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతోపాటు నెట్‌వర్క్ సౌకర్యాలను మరింత మెరుగ్గా చేసుకోవడం ద్వారా ఏపిని అభివృద్ది చేయాలనే చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ఐటి ప్రముఖులతో కూడా లోకేష్ వరుస భేటీలు జరిపారు. ప్రతీ ఇంటికీ 15 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలన్న చంద్రబాబు ఆలోచనను వివరిస్తూ... నెట్ వర్క్ రంగంలో పేరుగాంచిన సీటీవో ప్రదీప్ సింధూతో సమావేశమయారు! ఇదే సమయంలో ఫైబర్ గిర్డ్ గురించి కూడా చర్చించిన లోకేష్... అందుకు ప్రదీప్ సింధూకు ఆసక్తి కలిగేలా ప్రాజెక్టు గురించి వివరించారు. ఇలా అమెరికాలో లోకేష్ పర్యటన ఫుల్ బిజీగా నడుస్తుంది! ఎన్నో సమస్యలు, మరెన్నో సవాళ్లతో నిండికున్న ఏపీ పరిపాలన గురించి లోకేష్ తన వంతు సాయంగా ఈ పర్యటన చేస్తున్నారు!
ఇదే సమయంలో తెలుగువారి గొప్పతనాన్ని, అందుకు ఏపీ చంద్రబాబు చేసిన సేవలను కొనియాడారు లోకేష్! ప్రపంచాన్ని శాసించే దేశం అమెరికా అయితే... అమెరికాను శాసించేది మాత్రం తెలుగువారే అన్న లోకేష్... ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వల్లే సాధ్యమైందని చెప్పుకొచ్చారు! ఏపీ చరిత్ర టీడీపీ ఆవిర్భావానికి ముందూ, టీడీపీ తర్వాత అనే స్థాయిలో మార్పు చోటుచేసుకుందని వివరించారు!