200 యూట్యూబ్ ఛానెల్స్‌కు ప్లాన్ చేస్తున్న లోకేష్‌

Update: 2022-12-15 06:30 GMT
టీడీపీ యువ నాయ‌కుడు, పార్టీ కీల‌క‌నేత‌, చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ త్వ‌ర‌లోనే పాద‌యాత్ర ప్రారంభించ‌నున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబందించి ముహూర్తం కూడా ఖ‌రారైంది. జ‌న‌వ‌రి 27 నుంచి ఆయ‌న కుప్పం సెంట్రిక్‌గా పాద‌యాత్ర‌ను ప్రారంభించి దాదాపు 4000 కిలో మీట‌ర్ల దూరం న‌డ‌వ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న 400 కిలో మీట‌ర్ల ల‌క్ష్యం కూడా నిర్దేశించుకున్నారు.

విరామం లేకుండా నారా లోకేష్ పాద‌యాత్ర చేయ‌నున్నార‌ని.. ఇప్ప‌టికే పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. అయితే, ఈ పాద‌యాత్ర అంతిమ ల‌క్ష్యం.. పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డ‌మే. ఈ క్ర‌మంలో పాద‌యాత్ర స‌మ‌యంలో ఆయ‌న అనేక‌వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌నున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి ప‌ట్టణాల వ‌ర‌కు కూడా క‌వ‌ర్ చేస్తారు. అదేవిధంగా వృద్ధుల నుంచి యువ‌కుల వ‌ర‌కు ఆయ‌న క‌లిసి పార్టీ కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించున్నారు.

ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వ వ్య‌తిర‌క‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇదిలావుంటే.. ఈ పాద‌యాత్ర‌కు హైప్ తెచ్చేందుకు ఇప్ప‌టి నుంచి నారా లోకేష్ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. అనుకూల మీడియా ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్పుడు జ‌నాల‌కు బాగా యూట్యూబ్ అల‌వాటైన నేప‌థ్యంలో సాధ్య‌మైన‌న్ని యూట్యూబ్ చానెళ్ల ద్వారా త‌న పాద‌యాత్ర‌కు ప్ర‌చారం క‌ల్పించుకునే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

పాద‌యాత్ర స్టార్ట్ అయ్యే స‌రికి.. తెలుగులో ఉన్న పొలిటిక‌ల్ యూట్యూబ్ చానెళ్ల‌ను దాదాపు కొనేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఒక‌వేళ ఇది కుద‌ర‌క‌పోతే.. క‌నీసం వాళ్ల‌కు పెయిడ్ ప్రొపోర్ష‌న్ కోసం.. లీజుకు అయినా..తీసుకునే ఉద్దేశం ఉంద‌ని.. పార్టీలో చ‌ర్చ సాగుతోంది. పాద‌యాత్ర సంద‌ర్భంగా లోకేష్ చేసే ప్ర‌సంగాలు, ఆయ‌న పేల్చే పంచ్‌లు మార్మోగాల‌ని.. అప్పుడే ఆయ‌న‌పై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం వ‌స్తుంద‌ని ఆలోచ‌న చేస్తున్నార‌ట‌.

ఇట‌వ‌ల హైద‌రాబాద్‌లో చాలా మందిని నిరంత‌రం క‌లుస్తూ..యూట్యూబ్ వ్య‌వ‌హారాల‌పైనే చర్చిస్తున్న‌ట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీఆర్ ఎస్ పార్టీ దాదాపు అన్ని చానల్స్‌తో టై అప్ పెట్టుకుని ముందుకుసాగుతోంద‌ని చ‌ర్చ‌నడుస్తోంది. ఇటీవ‌ల మునుగోడు ఉప ఎన్నిక స‌మ‌యంలోనూ ఇదే సూత్రం పాటించింది. ఈ క్ర‌మంలోనే టీఆర్ ఎస్ మాదిరిగా తాను కూడా.. పెద్ద ఎత్తున యూట్యూబ్ చానెళ్ల‌ను కొనాలని భావిస్తుట్టు తెలుస్తోంది.

వీటి ద్వారా పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ప్రొమోష‌న్ చేయాల‌ని చూస్తున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు అంటున్నారు. పార్టీ వ్యూహ‌క‌ర్త రాబిన్ శ‌ర్మ‌.. ఇప్ప‌టికే కొన్ని స‌ల‌హాలు.. ఇచ్చార‌ని.. సోష‌ల్ మీడియాలో ఎలా ముందుకు సాగాల‌నే విష‌యంపై ఆయ‌న సూచ‌న‌లు చేశార‌ని తెలిసింది. దీని ప్ర‌కార‌మే.. లోకేష్ కూడా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News