లోకేష్.. కాన్ఫిడెన్స్ వెనుక రీజ‌నేంటి..?

Update: 2021-05-25 16:30 GMT
టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుమారుడు నారా లోకేష్‌లో కాన్ఫిడెన్స్ పెరిగిందా ?  లేదా.. అతి విశ్వాస‌మా ? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. తాజాగా ఆయ‌న విశాఖ‌ప‌ట్నం వెళ్లారు. ఇక్క‌డ ఇటీవ‌ల గుండెపోటుతో మృతి చెందిన డాక్ట‌ర్ సుధాక‌ర్ కుటుంబ స‌భ్యుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. ఈ క్ర‌మంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం.. లోకేష్‌ను మ‌రోసారి వార్తల్లో నిలిపింది. ``వ‌చ్చేది టీడీపీ ప్ర‌భుత్వం.. అధికారుల లెక్క‌లు బ‌య టకు తీస్తాం!!`` అంటూ.. లోకేష్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారుతున్నాయి. వాస్త‌వానికి ఏ పార్టీకైనా అధికారంలోకి రావాల‌నే ఉంటుంది. అందునా.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో టీడీపీ అధికా రంలోకి రావాల్సిన ఎంతైనా ఉంద‌నేది ఆ పార్టీ అభిమానులు సైతం చెబుతున్నారు.

కానీ, దీనికి సంబంధించిన ప‌రిస్థితి గ‌మ‌నిస్తే.. మాత్రం పార్టీ అధికారంలోకి వ‌చ్చేదెప్పుడు ? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది. కానీ.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని ఏ మాత్రం.. అంచ‌నా వేసుకోకుండానే లోకేష్‌.. అధికారంలోకి వ‌చ్చేది టీడీపీనే అని కామెంట్లు చేయ‌డం ఆస‌క్తిగా మారింది. నిజానికి ఇటీవ‌ల జ‌రిగిన తిరుప‌తి పార్ల‌మెంటు ఎన్నిక‌లో కానీ. కొన్నాళ్ల కింద‌ట జ‌రిగిన స్థానిక ఎన్నిక‌లో కానీ.. టీడీపీ ఓటు బ్యాంకు భారీగా త‌గ్గింది. లోకేష్ ఇంత దూకుడుగా.. రివేంజ్ స్టైల్లో ఎప్పుడు వ్యాఖ్య‌లు చేసేవారు కాదు. అలాంటిది ఇటీవ‌ల కాలంలో లోకేష్ అధికారంలోకి వ‌చ్చాక అంత‌కు అంత రివేంజ్ అన్న స్టైల్లోనే ఎక్కువుగా మాట్లాడుతున్నారు.

అయితే..లోకేష్‌కు ఈ విష‌యం తెలియ‌ద‌ని  అనుకోలేం. కానీ, ఈ కామెంట్ల  వెనుక రెండు కార‌ణాలు కనిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌టి.. పార్టీని పుంజుకునేలా చేసే వ్యూహాత్మ‌క కోణంలో భాగంగానే  నారా లోకేష్ ఇలా వ్యాఖ్యానిస్తున్నార‌ని అనేవారు ఉన్నారు. ఇంకొంద‌రు.. ప్ర‌జ‌ల మైండ్ సెట్‌ను త‌మ వైపు తిప్పుకోవ‌డంతో పాటు లోకేష్‌లో దూకుడు పెరిగిందిరా ? అన్న చ‌ర్చ జ‌నాల్లో స్టార్ట్ అయ్యే ప్లాన్‌లోనే లోకేష్ ఈ త‌ర‌హా రివేంజ్ డైలాగులు వేస్తున్నార‌ని చెబుతున్నారు.

అంటే.. విష‌యం లేక‌పోయినా.. ధీమా వ్య‌క్తం చేయ‌డం.. పార్టీలో లోపాలు ఉన్నా..ఏమీలేవ‌ని.. క‌ల‌రింగ్ ఇవ్వ‌డం ద్వారా.. పార్టీ పుంజుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం ఉంటాయ‌ని చెబుతున్నారు. అంటే.. మొత్తానికి లోకేష్ కాన్ఫిడెన్స్ వెనుక‌.. పార్టీలో ఏ మీకాలేదు.. టీడీపీ పుంజుకుంద‌ని, లోకేష్ రాటు దేలిపోయాడ‌ని ప్ర‌జ‌ల్లో ఓ క‌ల్ప‌న క్రియేట్ చేసే వాతావ‌ర‌ణ అయితే క‌నిపిస్తోందని  అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. ఇలాంటి ఎత్తుగ‌డ‌లు.. అన్ని వేళ‌లా.. అన్ని పార్టీల్లోనూ స‌క్సెస్ అయిన‌ ప‌రిస్థితి లేద‌నే విశ్లేష‌కులు కూడా చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News