రాజకీయ నేతల అవినీతి మీద విచారణ జరిపే లోక్ పాల్ ఎట్టకేలకు తన కార్యకలాపాల్ని స్టార్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ వ్యవస్థ కోసం 2013లో ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే భారీ ఉద్యమం చేయటం తెలిసిందే. స్వాతంత్య్ర పోరాటం తర్వాత యావత్ దేశం కనెక్ట్ అయ్యేలా చేసిన ప్రజాఉద్యమంగా దాన్ని చెబుతుంటారు.
మార్చి 23న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సమక్షంలో తొలి లోక్ పాల్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. లోక్ పాల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఏళ్లుగా సాగుతున్నా.. తాజాగా సాకారమైన ఈ వ్యవస్థ కేరాఫ్ అడ్రస్ ఎక్కడన్నది చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.
దేశ రాజధాని ఢిల్లీలో లోక్ పాల్ ఆఫీసును తెరిచేందుకు వీలైన భవనం లేదో మరే కారణమో కానీ.. లోక్ పాల్ కార్యకలాపాలకు వేదికగా ఒక ఫైవ్ స్టార్ హోటల్ ను ఎంపిక చేసుకోవటం షాక్ తగిలేలా చేస్తుంది.
కేంద్రస్థాయిలో లోక్ పాల్.. రాష్ట్రస్థాయిలో దాని శాఖలు పని చేసే ఈ వ్యవస్థకు సంబంధించిన కేరాఫ్ అడ్రస్ ఢిల్లీలోని ది అశోక్ హోటల్ కావటం గమనార్హం. ప్రస్తుతానికి లోక్ పాల్ కు ఏ భవనాన్ని కేటాయించని నేపథ్యంలో.. తాత్కాలిక కార్యాలయంగా ఒక ప్రముఖ హోటల్ ను తీసుకోవటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. మార్చి 27న ఎనిమిది మంది సభ్యులు తమ పదవులకు ప్రమాణస్వీకారం చేశారు. వీరంతా ఫైవ్ స్టార్ హోటల్లో తమ కార్యకలాపాల్ని నిర్వహించాల్సి ఉంటుంది. రాజకీయ వ్యవస్థలోని అవినీతి.. నేతల కక్కుర్తిని కంట్రోల్ చేయటం తర్వాత.. లోక్ పాల్ ఆఫీసు నిర్వహణకే భారీగా చమురు వదలటం ఖాయమని చెప్పక తప్పదు.