కరోనా వైరస్ ఏపీలో వేగంగా వ్యాప్తి చెందుతుంది, ముఖ్యంగా మన దేశంలో ఈ వ్యాధి విదేశాల నుండి వచ్చిన వారి నుండే వ్యాప్తి చెందుతుంది. ఇప్పటివరకు నమోదైన చాలా కేసులు ఈ కోవకి చెందినవే. గత కొన్ని రోజులుగా విదేశాల నుండి వచ్చే విమానాల్ని పూర్తిగా నిలిపివేయడంతో విదేశాల నుండి వచ్చే వారి బెడద తప్పిపోగా ..ఇప్పుడు ఒకరి నుండి మరొకరికి కరోనా సోకడం మొదలుపెట్టింది. విదేశాల నుండి వచ్చిన వారి వాళ్ల , వారి కుటుంబ సభ్యులకి కరోనా సోకుతుంది.
తాజాగా భీమిలి నియోజకవర్గంలో ఇటువంటి కేసు నమోదు అయ్యింది. లండన్ నుంచి వచ్చిన యువకుడికి ఇప్పటికే పాజిటివ్ వచ్చింది. తాజాగా ఆయన తండ్రికి కూడా పాజిటివ్ నమోదైంది. ఈ సంఘటన పద్మనాభం మండలంలోని వెంకటాపురం లో జరిగింది. దీనితో ఆ గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. గ్రామంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు రావడంతో ఆందోళన చెందుతున్నారు. పోలీసులు, అధికారులు గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
పూర్తి వివరాలు చూస్తే ... వెంకటాపురం గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడు లండన్ లో ఎంఎస్ చదువుతున్నాడు. లండన్ లోని బర్మింగ్‌హామ్ నుంచి ఢిల్లీ మీదుగా విశాఖ విమానశ్రయానికి వచ్చాడు. ఇక్కడ నుంచి ఈ నెల 17న పద్మనాభం మండలంలో ఉన్న తన సొంత గ్రామమైన వెంకటాపురం వచ్చాడు. 20న కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానం వచ్చింది. 21న విశాఖపట్నం చెస్టు ఆస్పత్రి లో చేరాడు. 22న ఇతనికి కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు. దీంతో యువకుడు కుటుంబంలోని నలుగురితో పాటు మొత్తం 23 మందిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరికి పాజిటివ్ రావడంతో 21 మంది గాయత్రి ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు. దీనితో యువకుడు తండ్రి ఎవరెవరిని కలిశాడో వైద్య శాఖ అధికారులు తెలుసుకుంటున్నారు.